Homeఅంతర్జాతీయంNarendra Modi : నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన... తెర వెనక పెద్ద కథ ఉంది..

Narendra Modi : నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటన… తెర వెనక పెద్ద కథ ఉంది..

Narendra Modi : ఇటీవల కాలంలో భారత ప్రధాన నరేంద్ర మోడీ విదేశాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. చిన్న చిన్న దేశాల నుంచి మొదలు పెడితే.. పెద్ద దేశాల వరకు నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. నరేంద్ర మోడీ ఇలా ఎందుకు వెళ్తున్నారు.. దీని వెనక ఏముంది.. దేశ ప్రయోజనాలు ఏ స్థాయిలో దాగి ఉన్నాయి.. అనేవి ఆసక్తికరమైన అంశాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన […]

Narendra Modi : ఇటీవల కాలంలో భారత ప్రధాన నరేంద్ర మోడీ విదేశాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నారు. చిన్న చిన్న దేశాల నుంచి మొదలు పెడితే.. పెద్ద దేశాల వరకు నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. నరేంద్ర మోడీ ఇలా ఎందుకు వెళ్తున్నారు.. దీని వెనక ఏముంది.. దేశ ప్రయోజనాలు ఏ స్థాయిలో దాగి ఉన్నాయి.. అనేవి ఆసక్తికరమైన అంశాలుగా మారిపోయాయి.

ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా మారింది.. గ్లోబల్ మీడియా కూడా ఆయన పర్యటనకు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. దానికి ప్రధాన కారణం బ్రహ్మోస్. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మీద బ్రహ్మో స్ మిసైల్స్ ప్రయోగించింది. 100% సక్సెస్ రేట్ తో అవి పని చేశాయి. దీంతో వాటిని కొనుగోలు చేయడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఈ మిస్సైల్స్ కోసం ఇండోనేషియా కూడా మన దేశాన్ని సంప్రదించింది. ఇండోనేషియా క భారత్ ఈ మిస్సైల్స్ కోసం ఒప్పందాలు కుదురుతుంది. ఇవి మాత్రమే కాకుండా అస్త్ర మిస్సైల్స్ కోసం కూడా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య అనేక రకాల చర్చలు జరిగాయి. కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇండోనేషియాలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. వాటి మీద భారీగా పెట్టుబడి పెట్టబోతోంది. ముఖ్యంగా స్టీల్.. నికెల్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ తయారీలో భారత్ భారీగా ఇన్వెస్ట్ చేయబోతోంది. ఇండోనేషియా ప్రాంతంలో సభాంగ్ పోర్టు కూడా నిర్మిస్తోంది. ఈ పోర్టు మలక్కా జల సంధికి దగ్గరగా ఉంటుంది. ఇది మన దేశానికి అత్యంత వ్యూహాత్మకమైనది.

ఇండోనేషియా కోసం భారత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తయారుచేసి అందించనుంది. ప్రధానికి ఇండోనేషియా ప్రభుత్వం బింటాంగ్ ఆది పూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారంతో గౌరవించింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడు భారత ప్రధానమంత్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణ కాలం నుంచి భారతదేశానికి, ఇండోనేషియాకు బలమైన సంబంధాలు ఉన్నాయని.. నరేంద్ర మోడీని చూసి తాను అనేక పథకాలను.. అనేక కార్యక్రమాలను కాపీ కొట్టానని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రకటించడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper