Homeఆంధ్రప్రదేశ్‌Kilaru Rajesh : ఎవరీ కిలారు రాజేష్.. నారా లోకేష్ కు అంత నమ్మకమేంటి

Kilaru Rajesh : ఎవరీ కిలారు రాజేష్.. నారా లోకేష్ కు అంత నమ్మకమేంటి

Kilaru Rajesh : రాజకీయాలలో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతమో అనే సామెత తీరుగానే అవి సాగిపోతుంటాయి. కానీ కొంతమంది వీటికి విరుద్ధంగా ఉంటారు. అవసరాలు కాకుండా ఆత్మీయత అనే ధోరణిలో పని చేస్తుంటారు. నాది అని కాకుండా.. మనది అనే కోణంలో అడుగులు వేస్తుంటారు. స్నేహం కోసం చివరికి తమను తాము కూడా లెక్క చేయరు. అటువంటివారు ఎటువంటి గుర్తింపును కోరుకోరు. ఎక్కడో మూలన ఉండిపోతారు. కానీ వెలుగులోకి వస్తే మాత్రం ఉదయించే […]

Kilaru Rajesh : రాజకీయాలలో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతమో అనే సామెత తీరుగానే అవి సాగిపోతుంటాయి. కానీ కొంతమంది వీటికి విరుద్ధంగా ఉంటారు. అవసరాలు కాకుండా ఆత్మీయత అనే ధోరణిలో పని చేస్తుంటారు. నాది అని కాకుండా.. మనది అనే కోణంలో అడుగులు వేస్తుంటారు. స్నేహం కోసం చివరికి తమను తాము కూడా లెక్క చేయరు. అటువంటివారు ఎటువంటి గుర్తింపును కోరుకోరు. ఎక్కడో మూలన ఉండిపోతారు. కానీ వెలుగులోకి వస్తే మాత్రం ఉదయించే సూర్యుడు కంటే ఎక్కువగా ప్రజ్వలిస్తుంటారు. ఈ ఉపమానం ఈ నాయకుడికి నూటికి నూరు శాతం సరిపోతుంది. ఆయన ఎవరు.. ఎందుకింత చర్చ జరుగుతోంది.. అనే ప్రశ్నలకు సమాధానం ఈ కథనం.

ఆయన పేరు కిలారు రాజేష్. తెలుగుదేశం పార్టీలో జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. సాధారణంగా ఈ స్థాయికి రావాలంటే తెలుగుదేశం పార్టీలో చాలా కష్టపడాలి. చిన్న వయసులోనే ఆయనకు ఈ పదవి రావడం ఒకరకంగా వరమైతే.. ఆయన పడిన కష్టానికి లభించిన గౌరవం. నారా లోకేష్, కిలారు రాజేష్ మధ్య బలమైన స్నేహం ఉంది. వీరిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. అలా ఏర్పడిన స్నేహం చివరికి రాజకీయాలకు దారితీసింది. రాజకీయాలలో కూడా నాలా లోకేష్ కు నమ్మిన బంటుగా కిలారు రాజేష్ ను ఆవిర్భవించేలా చేసింది.

2012లో తెలుగుదేశం పార్టీలో చేరారు రాజేష్. అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారం లో లేదు. తెలంగాణ ఉద్యమం వల్ల ప్రత్యేకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇలాంటి స్థితిలో పార్టీలో ప్రవేశించిన రాజేష్.. నారా లోకేష్ కు నమ్మిన బంటుగా మారిపోయారు. 2014లో ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావడంలో రాజేష్ కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా యువతను పార్టీకి దగ్గరగా చేశారు. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కిలారు రాజేష్ కీలకంగా వ్యవహరించారు.

2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత రాజేష్ మరింత పట్టుదలతో పనిచేయడం మొదలు పెట్టారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం తో లోకేష్ మీద ఒత్తిడి పెరిగిపోయింది.. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు అండగా నిలబడ్డారు రాజేష్. పార్టీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నారా లోకేష్ కు వివరించారు. వైసిపి చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు ఎండగట్టారు. తెర ముందుకు రాకపోయినప్పటికీ.. తెర వెనుక ఎంత చేయాలో అంతచేశారు రాజేష్. నారా లోకేష్ యువ గళం పేరుతో చేసిన పాదయాత్రకు కర్త కర్మ క్రియ రాజేష్ అంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 3000 కిలోమీటర్ల పాటు లోకేష్ పాదయాత్ర జరిగితే.. ప్రారంభం నుంచి చివరి వరకు రాజేష్ ఆయన వెంట ఉన్నారు. ప్రజా సమస్యలను గుర్తించడంలో.. ప్రజలకు నారా లోకేష్ ను మరింత చేరువ చేయడంలో రాజేష్ కీలక పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాజేష్ ఎటువంటి పదవిని కోరుకోలేదు. అధికారంలో లేనప్పుడు ఎలా అయితే ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.

అతడి నిరాడంబరతను గుర్తించిన పార్టీ సుప్రీమ్ చంద్రబాబు నాయుడు.. జనరల్ సెక్రటరీ పదవితో అతడి సేవలను గుర్తించారు.. దీంతో రాజేష్ సేవలను మరింత ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావించి ఈ పదవి కట్టబెట్టారు. జనరల్ సెక్రెటరీ పదవి వచ్చినప్పటికీ రాజేష్ డౌన్ టు ఎర్త్ లాగానే ఉన్నారు. నారా లోకేష్ కు నమ్మిన బంటు లాగానే సాగుతున్నారు..

విలువలు పాటించే వారికి పదవి అవసరం లేదు. పార్టీ మాత్రమే ముఖ్యం అనుకునే వారికి ఎటువంటి హోదా అవసరం లేదు. కొంతమంది ముందు గౌరవం కూడా తగ్గిపోతుంది. పదవి కూడా తన స్థాయి తగ్గించుకుంటుంది. ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తిత్వం ముందు మిగతావన్నీ చిన్న ఇసుక రేణువుల మాదిరి లాంటివే కదా.. ఈ ఉపమానం నూటికి నూరు శాతం కాదు కోటి శాతం కిలారు రాజేష్ కు వర్తిస్తుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper