Homeఎంటర్టైన్మెంట్Actress Rakshita : హీరోయిన్ రక్షిత గుర్తుందా.. ? ఆమె కొడుకు సినీ ఇండస్ట్రీ లో...

Actress Rakshita : హీరోయిన్ రక్షిత గుర్తుందా.. ? ఆమె కొడుకు సినీ ఇండస్ట్రీ లో ఏ స్థానంలో ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు..

Actress Rakshita : మన చిన్నతనం లో బాగా అలరించిన కొంత మంది హీరోయిన్స్ ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన లుక్స్ ని చూసి మనం చాలా బాధపడిపోతుంటాము. ఎలా ఉండే హీరోయిన్ ఎలా అయిపోయింది , అసలు ఎందుకు ఇలా తయారైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటాము. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రక్షిత. ఒకప్పుడు ఈమెకు యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె 2002 వ సంవత్సరం […]

Actress Rakshita : మన చిన్నతనం లో బాగా అలరించిన కొంత మంది హీరోయిన్స్ ఇప్పుడు గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన లుక్స్ ని చూసి మనం చాలా బాధపడిపోతుంటాము. ఎలా ఉండే హీరోయిన్ ఎలా అయిపోయింది , అసలు ఎందుకు ఇలా తయారైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటాము. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రక్షిత. ఒకప్పుడు ఈమెకు యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె 2002 వ సంవత్సరం లో ‘అప్పు’ అనే కన్నడ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఇది మన టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన రవితేజ ‘ఇడియట్’ కి ఒరిజినల్ వెర్షన్. రెండు భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో రక్షిత కన్నడ , తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

దీంతో అటు కన్నడ లోనూ , ఇటు తెలుగు లోనూ ఈమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. అలా తెలుగు లో ఈమె హీరోయిన్ గా నటించిన ‘పెళ్ళాం ఊరెళితే’, ‘శివమణి’, ‘నిజం’ , ‘అందరివాడు’ వంటి చిత్రాలు ఈమెకు మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. తెలుగు లో ఈమె చాలా తక్కువ సినిమాలు చేసింది కానీ , కన్నడ లో మాత్రం చాలా సినిమాలే చేసింది. 2007 వ సంవత్సరం వరకు చాలా యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, ఆ తర్వాత ప్రేమ్ అనే కన్నడ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్ళాడి , నటనకు బ్రేక్ ఇచ్చింది. దాంపత్య జీవితం లోకి వెళ్లిన తర్వాత ఫిట్నెస్ కోల్పోవడం తో ఎవ్వరూ ఊహించనంత లావుగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో హాట్ గా కనిపించే రక్షిత , అకస్మాత్తుగా ఇలా అయిపోయిందేంటి? అంటూ ఆమె అభిమానులు ఆశ్చర్యానికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే సినిమాల్లో నటనకు ఈమె బాగా దూరమైంది కానీ , నిర్మాతగా మాత్రం కొనసాగింది. కన్నడ లో ఇప్పటి వరకు ఈమె 3 సినిమాలను నిర్మించింది. ఇకపోతే రక్షిత కి సూర్య అనే కొడుకు ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఇతను బాగా ఎదిగిపోయాడు. ఇప్పుడు సినిమాల్లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చేయొచ్చు , ఆ రేంజ్ లుక్స్ తో కళకళలాడిపోతున్నాడు. త్వరలోనే ఈయన ఒక కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అతనికి సంబంధించిన ఫోటోని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper