Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy : సిదిరి అప్పలరాజు టెన్త్ స్టేట్ టాపర్.. అరెస్టు చేయకూడదు..వా.....

YS Jagan Mohan Reddy : సిదిరి అప్పలరాజు టెన్త్ స్టేట్ టాపర్.. అరెస్టు చేయకూడదు..వా.. జగన్ అన్న.. వా

YS Jagan Mohan Reddy : 18 సంవత్సరాల అబ్బాయికి బైక్ ఇవ్వడమే తప్పు. పైగా అతడు యాక్సిడెంట్ చేశాడు.. ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. అటువంటి యువకుడిని చట్టానికి అప్పగించకుండా.. కేసు తారుమారు చేశాడు. ఒక వ్యక్తిని చంపిన తన కుమారుడిని చట్టానికి అప్పగించకుండా.. గతంలో మంత్రిగా పనిచేశాననే సోయి కూడా లేకుండా సిదిరి అప్పలరాజు సాక్షాలను తారుమారు చేశాడు. ఒక ఎస్ఐ కూడా అప్పలరాజుకు సహకరించాడు. అయితే సాంకేతిక ఆధారాలు లభించడంతో అప్పలరాజు బాగోతం […]

YS Jagan Mohan Reddy : 18 సంవత్సరాల అబ్బాయికి బైక్ ఇవ్వడమే తప్పు. పైగా అతడు యాక్సిడెంట్ చేశాడు.. ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. అటువంటి యువకుడిని చట్టానికి అప్పగించకుండా.. కేసు తారుమారు చేశాడు.

ఒక వ్యక్తిని చంపిన తన కుమారుడిని చట్టానికి అప్పగించకుండా.. గతంలో మంత్రిగా పనిచేశాననే సోయి కూడా లేకుండా సిదిరి అప్పలరాజు సాక్షాలను తారుమారు చేశాడు. ఒక ఎస్ఐ కూడా అప్పలరాజుకు సహకరించాడు. అయితే సాంకేతిక ఆధారాలు లభించడంతో అప్పలరాజు బాగోతం బయటపడింది. ఇంకేముంది పోలీసులు అప్పలరాజు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. సాక్షాలు తారుమారు చేసినందుకు అప్పలరాజుని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు శ్రీకాకుళం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

జరిగింది ఇది.. వాస్తవం కూడా.. కానీ ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వ్యవహార శైలి విచిత్రంగా ఉంది. యాక్సిడెంట్ చేసి చంపితే.. ఆ యువకుడిని నేరస్తుడు అనకూడదట. పైగా అతడిని జైల్లో వేయకూడదట. సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోకూడదట. పైగా ఇక్కడ కులాల మధ్య కుంపట్లు రగులుతున్నాయట.. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం నిజంగా దారుణం.

సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి జగన్ నిర్ణయించుకున్నారు. గురువారం ఆయన అంపోలు వచ్చేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. అప్పలరాజు పరామర్శించడానికి వైసీపీ నేతలు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఇక్కడే సొంత ప్రచారానికి జగన్ తాపత్రయపడ్డారు. తాడేపల్లి నుంచి శ్రీకాకుళం వరకు భారీగా జన సందోహం ఉన్నట్టు.. అప్పలరాజును పరామర్శించడానికి వస్తుంటే జనం మొత్తం అడ్డు తగిలినట్టు బిల్డప్ ఇచ్చారు. సొంత ఛానల్లో లైవ్ కవరేజ్ ఇచ్చారు.

అప్పలరాజును పరామర్శించాలని జగన్ బలంగా అనుకుంటే.. ఎందుకు ఈ బల ప్రదర్శన.. అప్పలరాజును పరామర్శించిన తర్వాత బల ప్రదర్శన చేసుకోవచ్చు కదా. జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే ఒక ఖైదీని పరామర్శించాలని జగన్ కు తెలియదా. పైగా అప్పలరాజు కు టెన్త్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అట. అలాంటప్పుడు అతని కుమారుడు ఒకరిని యాక్సిడెంట్ చేసి చంపినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయకూడదట.. కుట్ర చేసి యాక్సిడెంట్ కేసును హత్య కేసు లాగా మార్చారట.. సాక్షాలు మార్చి.. కొడుకును అరెస్ట్ కాకుండా చేసింది ఎవరు.. దీనిని కుట్ర అనకూడదా. ఇందులో మోసం లేదా.. యాక్సిడెంట్ జరిగిన తర్వాత.. చనిపోయిన ఆ గొర్రెల కాపరి గురించి పోలీసులు ఎంక్వయిరీ చేశారు. వివరాలు తెలుసుకున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరో క్షణాల్లో తెలియదు కదా..

ఇలా చెప్పుకుంటూ పోతే అంపోలు జైలు వద్ద జగన్ నోటి నుంచి వచ్చిన సుభాషితాలు చాలానే ఉన్నాయి. వాటిని గనక రాస్తే ఖచ్చితంగా ఒక పుస్తకం అవుతుంది. సాక్షికి ఆప్షన్ లేదు.. కాబట్టి ఈ సొల్లు మొత్తం రాసుకు వచ్చింది. కానీ మాట్లాడిన ప్రతి మాటలో లౌక్యం లేకపోవడంతో జగన్ ట్రోల్ అవుతున్నారు.. విమర్శల పాలవుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper