Homeఆంధ్రప్రదేశ్‌Janasena woman leader video viral : కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా.. జనసేన మహిళ...

Janasena woman leader video viral : కాపు అబ్బాయిలు వెనుక కుక్కల్లా.. జనసేన మహిళ నేత వీడియో వైరల్!

Janasena woman leader video viral : ఏపీలో( Andhra Pradesh) కుల రాజకీయాలు నడుస్తున్నాయి. అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. తాజాగా జనసేన మహిళా అధికార ప్రతినిధి చేసిన హాట్ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో జనసేన మహిళా నేత మాట్లాడుతూ కాపుల అబ్బాయిల వెంట అమ్మాయిలు కుక్కల్లా పడతారు అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు హైలెట్ అవుతోంది. చాన్నాళ్ల కిందటే ఆమె […]

Janasena woman leader video viral : ఏపీలో( Andhra Pradesh) కుల రాజకీయాలు నడుస్తున్నాయి. అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. తాజాగా జనసేన మహిళా అధికార ప్రతినిధి చేసిన హాట్ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ ఇంటర్వ్యూలో జనసేన మహిళా నేత మాట్లాడుతూ కాపుల అబ్బాయిల వెంట అమ్మాయిలు కుక్కల్లా పడతారు అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు హైలెట్ అవుతోంది. చాన్నాళ్ల కిందటే ఆమె ఈ వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం అంబటి అరెస్ట్ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే సదరు మహిళా నేత కామెంట్స్ సోషల్ మీడియాలో వెలుగు చూడడం విశేషం..

* ఓ టీవీ ఇంటర్వ్యూలో…
జనసేన మహిళ అధికార ప్రతినిధిగా కన్నా రజిని( Kanna Rajini) ఉన్నారు. ఆమె చాలా రోజుల కిందట ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కాపులు కులాన్ని పెంచేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తమ కులపోళ్ళు కమ్మ వాళ్లను ఎక్కువగా ప్రేమిస్తారని చెప్పారు. వంగవీటి మోహన్ రంగా కమ్మ అమ్మాయిని ప్రేమించిన విషయాన్ని గుర్తు చేశారు. అల్లు అర్జున్ రెడ్డి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. రామ్ చరణ్ కూడా రెడ్డి అమ్మాయిని వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు. విడదల రజిని కూడా తమ కాపు కులానికి చెందిన అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగి ఉంటే పరవాలేదు.. తమ కాపుల అబ్బాయిల వెనుక అన్ని కులాల అమ్మాయిలు కుక్కల్లా పడిపోయినట్లు పడిపోతుంటారని.. అందుకే లీగల్ గా పెళ్లి చేసుకుంటారని అన్నారు. అయితే చాలా రోజుల కిందట ఆమె ఈ వ్యాఖ్యానాలు చేయగా.. ఇప్పుడు హైలెట్ చేస్తుండడం విశేషం.

* తాజాగా హాట్ కామెంట్స్..
మాజీ మంత్రి అంబటి( ambati Rambabu) అరెస్టు నేపథ్యంలో తాజాగా కూడా కన్నా రజిని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో దాడులు ఎవరు చేసినా ఖండించాల్సిందేనన్నారు. అంబటి వివాదం టిడిపి, వైసీపీ మధ్యనేనని తేల్చి చెప్పారు. జనసేనకు సంబంధం లేదని కూడా తేల్చేశారు. కూటమి ధర్మానికి కట్టుబడి జనసేన పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి పక్కకు వచ్చి మాట్లాడుతున్నానని తేల్చి చెప్పారు. పోలీసులు ఉండగానే టిడిపి కార్యకర్తలు కర్రలు, రాళ్లు పట్టుకొని అంబటి పై దాడికి దిగడం సరికాదన్నారు. పోలీస్ వ్యవస్థను అధికార పార్టీ శాసిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె పార్టీ లైన్ దాటినట్లు జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper