Homeక్రీడలుక్రికెట్‌RCB WPL 2026 : గత సీజన్లో గ్రూప్ దశ దాటలేదు.. ఈసారి విజేత.. స్మృతి...

RCB WPL 2026 : గత సీజన్లో గ్రూప్ దశ దాటలేదు.. ఈసారి విజేత.. స్మృతి కాదు ఆర్సీబీ ని నిలబెట్టింది వారిద్దరే!

RCB WPL 2026 : 2024లో విజేతగా నిలిచిన బెంగళూరు జట్టు.. 2025 సీజన్ కు వచ్చేసరికి గ్రూప్ దశ కూడా దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో 2026 సీజన్లో బెంగళూరు జట్టు మీద ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. ఈ క్రమంలో ఈ సీజన్లో అద్భుతమైన స్థాయిలో ఆట తీరు ప్రదర్శించి బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. గత సీజన్లో బెంగళూరు గ్రూప్ దశ కూడా దాటలేదు. ఈసారి తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. వాస్తవానికి ఐపిఎల్ లో […]

RCB WPL 2026 : 2024లో విజేతగా నిలిచిన బెంగళూరు జట్టు.. 2025 సీజన్ కు వచ్చేసరికి గ్రూప్ దశ కూడా దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో 2026 సీజన్లో బెంగళూరు జట్టు మీద ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. ఈ క్రమంలో ఈ సీజన్లో అద్భుతమైన స్థాయిలో ఆట తీరు ప్రదర్శించి బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది.

గత సీజన్లో బెంగళూరు గ్రూప్ దశ కూడా దాటలేదు. ఈసారి తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. వాస్తవానికి ఐపిఎల్ లో బ్యాటింగ్ ఏజట్టుకైనా ప్రధాన బలం. బౌలింగ్ సమర్థవంతంగా ఉంటే అది బ్యాటింగ్ ను సైతం డామినేట్ చేస్తుంది. 2026 సీజన్లో బెంగళూరు జట్టు అదే చేసింది. బెంగళూరు జట్టులో లారెన్ బెల్, నదైన్ డి క్లెర్క్ సత్తా చూపించారు. బెల్ ఇంతవరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడలేదు. అయితే ఈసారి బెంగళూరు జట్టు తరఫున ఆమె అవకాశం దక్కించుకుంది. అద్భుతంగా బౌలింగ్ చేసింది. 9 మ్యాచ్లలో 16.5 8 సగటుతో 12 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా 212 బంతులు వేసిన ఆమె.. 128 డాట్ బాల్స్ వేసింది.

డి క్లెర్క్ కూడా ప్రతి మ్యాచ్లో స్థిరంగా ఆడింది. అద్భుతంగా బౌలింగ్ వేసింది. 16 వికెట్లతో టాప్ 3 బౌలర్ గా ఆవిర్భవించింది. బంతితో మాత్రమే కాదు బ్యాటింగ్లో కూడా సత్తా చూపించింది. బెంగళూరు జట్టులో వీరిద్దరు మాత్రమే కాకుండా శ్రేయాంక 11 వికెట్లు పడగొట్టింది. సయారే 9 వికెట్లు సాధించి సత్తా చూపించింది. వాస్తవానికి టి20లో బౌలింగ్ కు విపరీతమైన ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా కట్టుదిట్టంగా బంతులు వేసే బౌలర్లకు మంచి పేరు ఉంటుంది. ప్రస్తుత ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెల్, డి క్లెర్క్ చిరస్థాయిలో బౌలింగ్ వేశారు. అందువల్లే బెంగళూరు జట్టు విజేతగా ఆవిర్భవించింది. లీగ్ దశలో ఏకంగా తొమ్మిది మ్యాచ్లకు ఏడ ఇంట్లో విజయాలు సాధించింది. ఈ బౌలర్ల గురించి బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇంతటి గొప్ప బౌలర్లను అందించినందుకు బెంగళూరు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో డాట్ బాల్స్ వేయడం అంత ఈజీ కాదు. ఇండియన్ మైదానాలపై వేయడం సులభం కాదు. కానీ, లారెన్ బెల్, నదైన్ డి క్లెర్క్ ఆ అద్భుతాన్ని చేసి చూపించారు. కట్టుదిట్టంగా బంతులు వేసి అదరగొట్టారు. ఫలితంగా బంతితో కూడా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మ్యాజిక్ చేయవచ్చని.. జట్టును గెలిపించవచ్చని నిరూపించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper