Homeఎంటర్టైన్మెంట్Dhurandhar movie : పాకిస్థాన్‌ లోనూ నంబర్ 1.. నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' విధ్వంసం..మొదటివారంలో వచ్చిన వ్యూస్...

Dhurandhar movie : పాకిస్థాన్‌ లోనూ నంబర్ 1.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ విధ్వంసం..మొదటివారంలో వచ్చిన వ్యూస్ ఎంతంటే!

Dhurandhar movie : గత ఏడాది డిసెంబర్ 4 ని బాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే సౌత్ నుండి వరుసగా క్రేజీ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి, బాలీవుడ్ లోకి కూడా ఆ సినిమాలు అడుగుపెట్టి, అక్కడి ఆడియన్స్ ని కూడా తమవైపుకు తిప్పుకుంటున్నాయి. అలాంటి సమయం లో వచ్చిన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు. ఓటీటీ లోకి ఈ చిత్రం అడుగుపెట్టి వారం రోజులు అవుతోంది. అయినప్పటికి […]

Dhurandhar movie : గత ఏడాది డిసెంబర్ 4 ని బాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే సౌత్ నుండి వరుసగా క్రేజీ కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి, బాలీవుడ్ లోకి కూడా ఆ సినిమాలు అడుగుపెట్టి, అక్కడి ఆడియన్స్ ని కూడా తమవైపుకు తిప్పుకుంటున్నాయి. అలాంటి సమయం లో వచ్చిన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ సాధారణమైనది కాదు. ఓటీటీ లోకి ఈ చిత్రం అడుగుపెట్టి వారం రోజులు అవుతోంది. అయినప్పటికి ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తుండడం చిన్న విషయం కాదు. సింగిల్ వెర్షన్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మన సౌత్ సినిమాలు అన్ని భాషలతో కలిపి రాబట్టే వసూళ్లను ఈ చిత్రం కేవలం ఒక్క భాష నుండే రాబట్టింది.

ఇకపోతే మొదటి 3 రోజుల్లోనే ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో 73 లక్షల వ్యూస్ వచ్చాయి. కేవలం మన దేశం లోనే కాదు, ఏకంగా 22 దేశాల్లో ఈ చిత్రం టాప్ 1 స్థానం లో కొనసాగుతుంది. అందులో మన శత్రు దేశం పాకిస్థాన్ కూడా ఉంది.మొదటి వారం లో ఈ చిత్రానికి పాకిస్థాన్ నుండి 2 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయట. ఈ చిత్రాన్ని పాకిస్థాన్ లో జరిగే రాజకీయాలు, అదే విధంగా అక్కడ టెర్రరిజం ఏ స్థాయిలో పాతుకుపోయింది?, ఇండియా లో వాళ్ళు చేసిన టెర్రరిస్ట్ అటాక్స్ ని కూడా చూపిస్తూ , ప్రతీ భారతీయుడి నెత్తురు మరిగేలాగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు డైరెక్టర్ ఆదిత్య డర్. దీంతో తమ దేశాలకు వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారనే ఉద్దేశ్యం తో ఈ సినిమాని మిడిల్ ఈస్ట్ దేశాల్లో బ్యాన్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు.

ఒకవేళ ఈ సినిమా మిడిల్ ఈస్ట్ లో విడుదల అయ్యుంటే ఓవర్సీస్ నుండి 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. అక్కడి ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడలేదు కాబట్టి, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే కచ్చితంగా నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం 50 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ ‘ధురంధర్ 2’ మార్చి 19 న విడుదల కాబోతుంది. రీసెంట్ గానే విడుదల చేసిన టీజర్ కి గొప్ప రెస్పాన్స్ ఏమి రాలేదు. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ లో చూపించిన క్లిఫ్ హ్యాంగర్ షాట్స్ ని టీజర్ లో చూపించారు. ఇప్పుడు ఓటీటీ లో ఈ చిత్రం సొంతం చేసుకుంటున్న రెస్పాన్స్ ని చూస్తుంటే, సీక్వెల్ కేవలం మొదటి వారం లోనే వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకునేలా అనిపిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper