Pakistan demand Dhurandhar 2 : మన ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్థాన్ ఎంత భయపడిందో, మన ఇండియన్ డైరెక్టర్ ఆదిత్య డర్ దెబ్బకు అంతకు మించి ఎక్కువ భయపడింది. ఎంతలా అంటే, పాకిస్థాన్ వాళ్ళు తమ వాళ్లనే అనుమానించే రేంజ్ లో అన్నమాట. రోడ్డు మీద ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా నువ్వు ఇండియన్ గూడాచారివా ? అంటూ నిలదీసి, వాళ్ళని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేసిన వీడియోలు సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) విజయాన్ని చూసిన తర్వాత పాకిస్థాన్ నుండి సరికొత్త డిమాండ్ ఒకటి మొదలైంది. మా దేశం లోని ‘ల్యారీ’ నగరం పేరు ని ఉపయోగించి , ధురంధర్ టీం వేల కోట్ల రూపాయిలు సంపాదించింది, ఇది న్యాయం కాదు, సంపాదించిన దాంట్లో మాకు కచ్చితంగా వాటాలు కావలి అంటూ ల్యారీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారట.
వింటుంటే చాలా విడ్డూరంగాను, అదే విధంగా హాస్యంగానూ అనిపిస్తుంది కదూ. ఎంతైనా ‘కడుక్కునే నీళ్ల కోసం అడుక్కునే దేశం’ కదా , వాళ్ళ నుండి ఇలాంటి డిమాండ్స్ వినిపించడం లో వింతేమీ లేదు. ఇలాంటి లెక్కలు వేసుకుంటూ పోతే, మన ఇండియా కి పాకిస్థాన్ వాళ్ళు అప్పులు తీర్చాలంటే, వాళ్ళ దేశాన్ని అమ్మేసిన సరిపోదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మన దేశానికీ సంబంధించిన కాశ్మిర్ లోని సగభాగాన్ని ఆక్రమించుకుంది కాకుండా, సింధు జలాలను మేము దయ చూపించి వదిలితే కానీ బ్రతకాని దేశం అది, వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడడం హాస్యాస్పదం అంటూ వెక్కిరిస్తున్నారు నెటిజెన్స్. మిమ్మల్ని భయపెట్టడానికి మా ఇండియన్ ఆర్మీ చాలా ఎక్కువ , ఆదిత్య డర్ లాంటి డైరెక్టర్ చాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజెన్స్. ఇక ‘ధురంధర్ 2’ బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ గురించి ఒక లుక్ వేస్తే , ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే 1360 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ వారం లో కచ్చితంగా ఈ చిత్రం పుష్ప 2 లైఫ్ టైం కలెక్షన్స్ 1680 కోట్ల గ్రాస్ ని అధిగమించి, 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వైపు అడుగులు వేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం దంగల్ చిత్రం మాత్రమే 2000 కోట్ల మార్కుని అందుకుంది. ఇప్పుడు ‘ధురంధర్ 2 ‘ చిత్రం కూడా ఆ జాబితాలోకి చేరనుంది. ఓవర్సీస్ లో అయితే మిడిల్ ఈస్ట్ మినహాయించి, ఈ చిత్రం మిగిలిన అన్ని దేశాల్లోనూ ఆల్ టైం రికార్డ్స్ ని నమోదు చేసుకుంది.