Homeఎంటర్టైన్మెంట్IPL impact on Dhurandhar 2 collections: IPL ఎఫెక్ట్ మరీ ఈ రేంజ్ లో...

IPL impact on Dhurandhar 2 collections: IPL ఎఫెక్ట్ మరీ ఈ రేంజ్ లో ఉందా..18వ రోజున ‘ధురంధర్ 2’ కి వచ్చిన గ్రాస్ ఎంతంటే..

IPL impact on Dhurandhar 2 collections: సమ్మర్ లో మన స్టార్ హీరోలు తమ సినిమాలను ఈమధ్య కాలం లో విడుదల చేయడానికి కాస్త ఆలోచిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం IPL సీజన్. యూత్ ఆడియన్స్ అత్యధిక శాతం ఈ సీజన్ కి అడిక్ట్ అయిపోవడం తో థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. ఆ కారణం చేత 3 నెలల పాటు థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించిన ‘ధురంధర్’ సీక్వెల్ ‘ధురంధర్ 2′(Dhurandhar […]

IPL impact on Dhurandhar 2 collections: సమ్మర్ లో మన స్టార్ హీరోలు తమ సినిమాలను ఈమధ్య కాలం లో విడుదల చేయడానికి కాస్త ఆలోచిస్తున్నారు. అందుకు ముఖ్య కారణం IPL సీజన్. యూత్ ఆడియన్స్ అత్యధిక శాతం ఈ సీజన్ కి అడిక్ట్ అయిపోవడం తో థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. ఆ కారణం చేత 3 నెలల పాటు థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించిన ‘ధురంధర్’ సీక్వెల్ ‘ధురంధర్ 2′(Dhurandhar 2: The Revenge) ఇప్పుడు కేవలం నెల రోజుల రన్ కి మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది. 11 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా వసూళ్లు భారీగా పడిపోవడాన్ని చూసి ట్రేడ్ విశ్లేషకులు నోరెళ్లబెట్టారు. 2000 కోట్ల గ్రాస్ మార్కుని అవలీలగా అందుకుంటుందని అనుకుంటే , ఇప్పుడు ‘బాహుబలి 2’ ఫుల్ రన్ ని కూడా దాటడం కష్టమే అని అనిపిస్తోంది. 18 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వచ్చిందో చూద్దాం.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 18 వ రోజున కేవలం 28 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ‘ధురంధర్’ తో పోలిస్తే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ‘ధురంధర్’ చిత్రానికి మూడవ ఆదివారం 45 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అలాంటిది ఈ సినిమాకు 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు తక్కువ వచ్చాయి. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తో పాటు , సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కూడా ఉండడం వల్లే ఈ చిత్రం వసూళ్లు ఈ రేంజ్ లో పడిపోయాయి అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా ఈ చిత్రానికి 18 రోజులకు కలిపి 1648 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఈ చిత్రం 400 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి చాలా దగ్గర్లో ఉంది. ఈరోజు, లేదా రేపటి లోపు ఆ మార్కును అందుకుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక బుక్ మై షో టికెట్ సేల్స్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ చిత్రానికి 16 మిలియన్ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. క్లోజింగ్ కి మరో 1 మిలియన్ టిక్కెట్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి, ఓవరాల్ గా బాహుబలి 2 కంటే తక్కువ టిక్కెట్లు అమ్ముడుపోయాయని అంటున్నారు. ‘బాహుబలి 2’ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా దాదాపుగా 18 మిల్లియన్లకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper