Homeజాతీయ వార్తలుGoa ex CM daughter harassment : మాజీ ముఖ్యమంత్రి కూతురుకు తప్పని వేధింపులు.. వెలుగులోకి...

Goa ex CM daughter harassment : మాజీ ముఖ్యమంత్రి కూతురుకు తప్పని వేధింపులు.. వెలుగులోకి దారుణ ఘటన

Goa ex CM daughter harassment : ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో.. ఇంకో రకమైన అవసరం పేరుతో చాలామంది అమ్మాయిలను మోసం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలు కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సాధారణ యువతులు.. మహిళలకు మాత్రమే వేధింపులు ఎదురయ్యవనే వార్తలను మనం విన్నాం. మీడియాలో చూసాం. కానీ, ఓ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఈ జాబితాలో చేరడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గోవా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి […]

Goa ex CM daughter harassment : ఆడపిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో.. ఇంకో రకమైన అవసరం పేరుతో చాలామంది అమ్మాయిలను మోసం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలు కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు సాధారణ యువతులు.. మహిళలకు మాత్రమే వేధింపులు ఎదురయ్యవనే వార్తలను మనం విన్నాం. మీడియాలో చూసాం. కానీ, ఓ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఈ జాబితాలో చేరడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

గోవా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె వాలంక అలెమావో కీలక ఆరోపణలు చేశారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ చీఫ్ కళ్యాణ్ చౌబే పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈనెల 29న ఢిల్లీలోని ఫుట్బాల్ హౌస్ లో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ సందర్భంగా తనపై వేధింపులకు పాల్పడ్డారని వాలంకా ఆరోపించారు. సీనియర్ అధికారులు తన ఇబ్బంది పెట్టారని.. ఎగతాళిగా మాట్లాడారని.. వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు.. ఇటీవల ఆమె భారత మహిళల ఆసియా కప్ క్యాంపెయిన్ లో పాలనపరమైన లోపాలను ఎత్తిచూపారు. మహిళలకు సరైన గౌరవం లభించడం లేదని.. ప్రోత్సాహం అందించడం లేదని.. అందువల్లే మహిళలు ఫుట్ బాల్ క్రీడలో రాణించలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు మొత్తం పక్కదారి పడుతున్నాయని ఆమె ఆధారాలతో సహా వివరించారు.

“నన్ను ఇబ్బంది పెడుతున్నారు. గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. నిజాలను బయట పెట్టకుండా ఆపివేస్తున్నారు. కొంతకాలంగా నేను నిజాలు చెప్పాలని అనుకుంటున్నాను. నా వంతు ప్రయత్నాలు చేస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. లోపాలను ఎత్తి చూపిస్తే తప్పు ఏముంది.. సవరించుకుంటే సరిపోతుంది కదా. కానీ తప్పులు చేసిన వ్యక్తులు తమ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను దోషిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక ఆడదానిని ఇబ్బంది పెట్టడానికి ఇన్ని శక్తులు ఎదురవుతున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చని” వాలంక ఆరోపించారు.

వాలంక ఏఐఎఫ్ఎఫ్ మహిళల ఫుట్బాల్ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఫుట్బాల్ క్రీడలో మహిళలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రికెట్ ఆధిపత్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఫుట్బాల్ క్రీడ కూడా అదే స్థాయిలో గుర్తింపు పొందాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల కళ్యాణ్, సీనియర్ అధికారులను ప్రస్తావిస్తూ ఆమె ఎగ్జిక్యూటివ్ అధికారులకు లేఖ రాశారు.. చౌబే, హరీష్, సత్యనారాయన్ ప్రవర్తన బాగోలేదని.. వారంతా కూడా ఇబ్బందులు పెడుతున్నారని.. ఒక మహిళను అని కూడా చూడకుండా తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. మరి దీనిపై ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper