Homeజాతీయ వార్తలుCockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ ఆంక్షలు మరింత పెరిగిపోయాయి. బారికేడ్లు ఎక్కువైపోయాయి. పోలీసులు అడుగడుగునా తనిఖీలు మొదలుపెట్టారు. ఇదంతా కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాల కోసం కాదు. దీనికి కారణం బొద్దింకలు. బొద్దింకలు ఆస్థాయిలో ఉంటాయా.. ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో ఇబ్బంది పెడతాయా.. అనే అనుమానాలు మీలో […]

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ ఆంక్షలు మరింత పెరిగిపోయాయి. బారికేడ్లు ఎక్కువైపోయాయి. పోలీసులు అడుగడుగునా తనిఖీలు మొదలుపెట్టారు. ఇదంతా కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాల కోసం కాదు. దీనికి కారణం బొద్దింకలు.

బొద్దింకలు ఆస్థాయిలో ఉంటాయా.. ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో ఇబ్బంది పెడతాయా.. అనే అనుమానాలు మీలో వ్యక్తం కావచ్చు. కానీ అవి మామూలు బొద్దింకలు కావు. అవి కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకలు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగడం.. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో సీజేపీ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ ఏకంగా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఆయనను బలవంతంగా దీక్ష విరమింపజేశారు.

సోనం ప్రస్తుతం ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ ఆసుపత్రి నుంచే ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక లేఖ కూడా రాశారు. ఆ తర్వాత వేలాది మందిగా విద్యార్థులు ఢిల్లీ నగరానికి వచ్చారు. వారిని అడ్డుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పోలీసులు విద్యార్థులను చెదర గొట్టారు. బాష్ప వాయువును ప్రయోగించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హుటాహుటిన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడే ధర్మేంద్ర ప్రధాన్ ను భేటీ అయ్యారు. మరోవైపు జేపీ నడ్డా విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఆయన సోనం వాంగ్ చుక్ ను కలుస్తారని తెలుస్తోంది.

చలో పార్లమెంటు పిలుపును బిజెపి పెద్దలు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. పైగా కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఇచ్చిన పిలుపుకు అంత మంది వస్తారని అంచనా వేయలేదు . కానీ విద్యార్థులు భారీగా రావడంతో ఢిల్లీలోని ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.. హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ముందుగానే భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థులు ఢిల్లీలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ భారీగా తరలివచ్చిన విద్యార్థులు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. విద్యార్థులు భారీగా రావడంతో కేంద్ర పెద్దలు దిగివచ్చినట్టు తెలుస్తోంది. అందువల్లే కేంద్ర హోంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper