Homeఎంటర్టైన్మెంట్Balakrishna : బాలయ్య వేట మొదలుపెట్టాడుగా...ఇక తగ్గేదే లేదు...

Balakrishna : బాలయ్య వేట మొదలుపెట్టాడుగా…ఇక తగ్గేదే లేదు…

Balakrishna : నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఆయన బోయపాటి డైరెక్షన్ లో చేసిన ‘అఖండ 2’ సినిమాతో భారీగా డీలాపడ్డాడు. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన అనుకున్న సక్సెస్ ని సాధిస్తాడని అందరు అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేదు. ఇక ఎట్టకేలకు ఆయన భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటాడా? ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోలకు పోటీని ఇస్తు తన స్టామినా ఏంటో చూపించగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటితో పాటు ఇంకొంతమంది దర్శకులు చెప్పే కథలను వింటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తమిళ స్టార్ డైరెక్టర్ అయిన హరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. కారణం ఏంటంటే హరి కమర్షియల్ సినిమాలను పర్ఫెక్ట్ గా చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు కాబట్టి అలాంటి దర్శకుడు బాలయ్య బాబుకి పడితే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని బాలయ్య అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో హరి ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించడం లేదు. కాబట్టి ఈ మూవీ తనకి ఏ రేంజ్ సక్సెస్ ను సాధించి పెడుతుంది. తద్వారా బాలయ్య సైతం మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక హరి తన కెరియర్ లో చేసిన సినిమాల్లో స్వామి, సింగం సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి.

ఇక ఇప్పుడు అలాంటి సినిమాలే చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక వాటాన్నింటిని ఆయన ఎలా మేనేజ్ చేస్తాడు. బాలయ్య ఇమేజ్ ను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి హరికి ఉందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇదంతా చూస్తున్న బాలయ్య బాబు అభిమానులు మాత్రం బాలయ్య ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన ఇదే ఊపులో ముందుకెళ్తే మరిన్ని సక్సెస్ లను సాధించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular