Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Budget 2026 : ఏపీ బడ్జెట్ : అమరావతికి భారీగా నిధులు

Andhra Pradesh Budget 2026 : ఏపీ బడ్జెట్ : అమరావతికి భారీగా నిధులు

Andhra Pradesh Budget 2026 : అమరావతికి( Amravati capital ) గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అమరావతి.. దీ పీపుల్స్ కాపిటల్ పేరుతో.. అభివృద్ధి పనులకు రూ.6000 కోట్లు కేటాయించారు. గత వార్షిక బడ్జెట్లో సైతం ఇంతే మొత్తాన్ని కేటాయించడం విశేషం. అమరావతి రాజధాని లో నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సౌకర్యాలు, ప్రభుత్వ శాఖలకు కావాల్సిన భవన నిర్మాణానికి గాను ఈ 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. గత ఏడాది సైతం వార్షిక బడ్జెట్లో అమరావతికి ప్రాధాన్యం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది కూడా అదే ఆనవాయితీని కొనసాగించింది.

* గత అనుభవాల దృష్ట్యా..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి ప్రాధాన్యం ఇచ్చింది. వీలైనంత త్వరగా అమరావతిని పూర్తి చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత అనుభవాల దృష్ట్యా 2028 నాటికి అమరావతిని ఒక కొలిక్కి తేవాలని చూస్తోంది. అందుకే రాష్ట్ర బడ్జెట్లో అధిక కేటాయింపులు చేస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతికి ప్రాధాన్యం ఇస్తోంది. 2024లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం.. అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధుల సర్దుబాటుకు అవకాశం ఇచ్చింది.

* శరవేగంగా పనులు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం, అధికంగా నిధులు కేటాయించడంతో.. నిధుల కొరత లేకుండా అమరావతి పనులు శరవేగంగా జరిగేందుకు అవకాశం కలిగింది. అయితే ఈ ఏడాది సైతం రాష్ట్ర ప్రభుత్వ పరంగా వార్షిక బడ్జెట్లో 6000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా.. మరింతగా దూకుడుగా పనులు జరిపేందుకు దోహదం కలగనుంది. ఏకంగా 6000 కోట్ల రూపాయలు కేటాయించడంపై అమరావతి ప్రాంత రైతులు, ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రాజధాని లో పనులు ఇకనుంచి వేగం పెంచుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2028 నాటికి అమరావతి రాజధానిని ఒక కొలిక్కి తెచ్చి.. ప్రపంచం ముందు నిలబెట్టాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రాధాన్యమిస్తోంది. అయితే తాజాగా రికార్డు స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు చూస్తుంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రాధాన్యమిస్తుందో అర్థమవుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper