Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni Injury : బాత్రూంలో జారిపడిన అక్కినేని అఖిల్.. తీవ్ర గాయాలు.. 42 కుట్లు.....

Akhil Akkineni Injury : బాత్రూంలో జారిపడిన అక్కినేని అఖిల్.. తీవ్ర గాయాలు.. 42 కుట్లు.. వీడియో వైరల్..

Akhil Akkineni Injury : అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘లెనిన్’ చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అఖిల్ అనేక ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన ‘లెనిన్’ చిత్రం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అభిమానులు తనపై ఎంత […]

Akhil Akkineni Injury : అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘లెనిన్’ చిత్రం ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అఖిల్ అనేక ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన ‘లెనిన్’ చిత్రం గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అభిమానులు తనపై ఎంత కోపంగా ఉన్నారో చెప్పుకొచ్చారు. కెరీర్ మొత్తం మీద సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు , ఇలాంటి సమయం లో మూడేళ్లు గ్యాప్ ఇచ్చేసరికి అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అఖిల్ ని ట్యాగ్ చేసి తిట్టడం మొదలు పెట్టారు. ఇదే అంశాన్ని ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడుగుతారు. ఇంత గ్యాప్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ మీ మీద కోపం గా ఉన్నారు, వాళ్లకు ఏమి సమాధానం చెప్తారు అని అడుగుతారు.

అందుకు అఖిల్ సమాధానం చెప్తూ ‘వాళ్లకు కోపం రావడం లో తప్పు లేదు. నా వైపు కొంత మిస్టేక్ ఉంది , అదే విధంగా టెక్నీకల్ వాల్యూస్ పరంగా కొంత ఆలస్యం అయ్యింది. నేను కావాలని మాత్రం ఆలస్యం చేయలేదు , బాత్రూం లో ఒకరోజు జారీ ఒక గ్లాస్ అడ్డం మీద పడ్డాను , తీవ్రమైన గాయాలు అయ్యాయి, రెండు సర్జరీలు జరిగాయి, 42 కుట్లు పడ్డాయి. ఆ కారణం చేత 16 నెలలు షూటింగ్ కి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా సరైన కథ వచ్చేంత వరకు సినిమా చేయకూడదు అని అనుకున్నాను. 16 నెలల తర్వాత నేను పూర్తిగా కోలుకొని , జిమ్ లో వర్కౌట్స్ చేసి , బలాన్ని రప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి , ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో అక్కినేని ఫ్యాన్స్ నువ్వు సినిమాల పట్ల సీరియస్ గా లేవని తప్పుగా అపార్థం చేసుకున్నాము , దయచేసి మమ్మల్ని క్షమించు అంటూ ట్వీట్లు వేస్తున్నారు. ప్రతీ సినిమాకు అఖిల్ తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు, డ్యాన్స్ బాగా వేస్తారు , ఫైట్స్ అద్భుతంగా చేస్తారు , నటన కూడా పర్వాలేదు అనిపించుకున్నారు , కానీ స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం వల్ల, ఆయన వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ ‘లెనిన్’ పట్ల అఖిల్ చాలా నమ్మకంతో ఉన్నారు , ఆయన మాటల్లోని కాన్ఫిడెన్స్ , ఉత్సాహం చూస్తుంటే ఈసారి కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం అనిపిస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper