Aditya Pharmacy MD: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్య కు పాల్పడ్డారు. అయోధ్యనగర్ క్షత్రియభవన్ లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. గతేడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తిరాజు.. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఆత్మహత్యకుగల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహ మూర్తి రాజు ఆత్మహత్య
విజయవాడ – అయోధ్య నగర్ క్షత్రియ భవన్లో ఆత్మహత్య చేసుకున్న నరసింహమూర్తి రాజు
స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తి రాజు
హత్య కేసులో బెయిల్పై బయటికొచ్చి అనూహ్యంగా ఆత్మహత్య
అప్పుల భారం ఎక్కువై ఆత్మహత్య… pic.twitter.com/OzB9zy3VTD
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2025