MG Hector Plus : ఎంజీ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను పెంచుతూ జూలై 2025లో వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా 7-సీటర్ ఎంజీ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ కూడా ఉంది. కంపెనీ ఈ ఎస్‌యూవీలోని అన్ని మోడల్స్ ధరలను పెంచింది. దీనితో ఇప్పుడు ఈ కారును కొనాలంటే ఇంకా 30,400 వరకు ఎక్కువ వెచ్చించాలి. మొత్తంగా ఈ పెరుగుదల చూస్తే 1.37% ఉంది. ధర పెరిగినప్పటికీ ఎస్‌యూవీలో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. హెక్టర్ ప్లస్‌లో ఇప్పటికీ గతంలో ఉన్న రెండు ఇంజిన్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.
1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 143 హార్స్‌పవర్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.2.0-లీటర్ ఎఫ్‌సీఏ ఆధారిత డీజిల్ ఇంజిన్ 170hp ఎనర్జీ ఇస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. హెక్టర్ ప్లస్‌లో అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇవి దీనిని ఒక ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఎస్‌యూవీగా మారుస్తాయి.
ఇప్పుడు ఇందులో పెద్ద 14-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేలకు సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీని 6-సీటర్ , 7-సీటర్ రెండు మోడల్స్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని లోపలి భాగం డ్యూయల్-టోన్ అర్గిల్ బ్రౌన్, బ్లాక్ థీమ్‌లో వస్తుంది. లెదర్-రాప్డ్ స్టీరింగ్, లెదరెట్ సీట్స్‌తో ఇది చాలా ప్రీమియం ఫీలింగ్‌ను ఇస్తుంది.
Also Read: వార్ 2 మూవీ ప్రమోషన్స్ ఎన్టీఆర్ ఎలివేషన్ మామూలుగా లేదుగా…వైరల్ వీడియో…
కొత్త ధరలను పరిశీలిస్తే.. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో సెలెక్ట్ ప్రో 7ఎస్ ధర రూ.19,35,800, షార్ప్ ప్రో 6ఎస్ ధర రూ.21,90,400, షార్ప్ ప్రో 7ఎస్ వేరియంట్ ధర రూ.21,90,400గా ఉంది. అలాగే 1.5-లీటర్ టర్బో పెట్రోల్ సీవీటీ ఆటోమేటిక్ వేరియంటల్లో సెలెక్ట్ ప్రో 7ఎస్ రూ.20,63,000, షార్ప్ ప్రో 6ఎస్ రూ.23,16,600, షార్ప్ ప్రో 7ఎస్ రూ.23,16,600గా నిర్ణయించారు.
సేఫ్టీ విషయంలో హెక్టర్ ప్లస్‌లో ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏడీఏఎస్ ఫీచర్లు, ఏబీఎస్ తో పాటు ఈబీడీ, ఈఎస్‌సీ, టీపీఎంఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో వేరియంట్‌లలో క్రూజ్ కంట్రోల్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ , స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి అడ్వాన్స్ డ్ ఫీచర్లు కూడా లభిస్తాయి.