Pooja Hegde: ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కి నేడు విమానాశ్రయం లో చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్ దిగి ఎంట్రన్స్ వద్దకు వస్తున్న సమయం లో, QR కోడ్ స్కానింగ్ వైపుగా వెళ్లకుండా, వేరే వైపు వెళ్లడం తో సెక్యూరిటీ ఆమెకు సరైన దారి చూపడం, అనంతరం QR కోడ్ స్కాన్ చేసి వెళ్లడం జరిగింది. అయితే ఇన్ని సార్లు ఫ్లైట్ లో ప్రయాణించిన పూజ హెగ్డే కి ఇంత చిన్న విషయం కూడా తెలియదా?, ఒకవేళ తెలిసినా హడావడిలో మర్చిపోయిందా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే పూజ హెగ్డే ఎంత క్యూట్ గా ఉందో, మా దిష్ఠి నే తగిలేలా ఉందని అంటున్నారు.
ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే రాఘవ లారెన్స్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కాంచన 4 లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు, బాలీవుడ్ లో ఆమె పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతోంది. అయితే పూజ హెగ్డే పూర్తి స్థాయిలో తెలుగు సినిమా చేసి చాలా రోజులే అయ్యింది. ఆచార్య తర్వాత ఆమె నేరుగా మరో టాలీవుడ్ సినిమాలో నటించలేదు. ఇది ఆమె అభిమానులకు తీవ్రమైన నిరాశ కలిగించే విషయం. పూజా హెగ్డే తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు, స్టార్ హీరోలు అందరూ సిద్దంగానే ఉన్నప్పటికీ, ఆమె బాలీవుడ్ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తోంది. మరి టాలీవుడ్ లోకి ఆమె ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.