Mukesh Gowda: ప్రస్తుత బిగ్ బాస్ తెలుగు సీజన్ కి టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ లో ఒకరు ముకేశ్ గౌడ. సీరియల్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ముకేశ్, మొదట్లో టాప్ 3 రేంజ్ లో ఉండేవాడు కానీ , ఇప్పుడు టాప్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ముకేశ్ కి హీరోయిన్ రష్మిక కి మధ్య ఉన్న రిలేషన్ ని చూసి సోషల్ మీడియా లో అందరూ షాక్ అవుతున్నారు. మొన్నటి ఎపిసోడ్ లో తన లేటెస్ట్ మూవీ ‘మైసా’ ప్రొమోషన్స్ కోసం బిగ్ బాస్ స్టేజి మీదకు వచ్చిన రష్మిక ముకేశ్ ని చూడగానే షాక్ అయ్యి, ఇతను మా కాలేజీ లో నా సీనియర్, ఇక్కడ ఉన్నాడేంటి అంటూ నాగార్జున తో చెప్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
ఒకే కాలేజ్ లో చదువుకున్న ఒక సీనియర్, జూనియర్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం చాలా గమ్మత్తుగా ఉంది కదూ. అయితే రష్మిక కి పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ఉంది. ఇక ముకేశ్ కి బుల్లితెర ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ ముకేశ్ కూడా ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెట్టి సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేసాడు. కన్నడలో ఒక సినిమాలో హీరోగా నటించాడు కానీ , అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో మళ్లీ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తాడో లేదో చూడాలి. ఈ సీజన్ లో ముకేశ్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ అదే నిజమైతే ముకేష్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.