Homeక్రైమ్‌Bihar Railway Theft: ఇలా ఉన్నారేంట్రా.. 25వేల వోల్టుల హై-టెన్షన్ కేబుల్‌ను ఇలా కొట్టేస్తారా..

Bihar Railway Theft: ఇలా ఉన్నారేంట్రా.. 25వేల వోల్టుల హై-టెన్షన్ కేబుల్‌ను ఇలా కొట్టేస్తారా..

Bihar Railway Theft: చిన్నప్పుడు మనం స్టువర్టుపురం దొంగల గురించి పుస్తకాల్లో చదివి ఉంటాం లేదా టీవీలలో చూసి ఉంటాం. స్టువర్టుపురం దొంగలనే గజదొంగలని.. కరుడుగట్టిన చోర శిఖామణులు అని అనుకుంటాం.. కానీ నేటి కాలంలో వారిని మించిపోయారు వీరు. వీరు చేసిన దొంగతనం అలాంటిది మరి.. ఏకంగా జాతీయస్థాయిలో చర్చకు దారి తీయడం మాత్రమే కాదు.. రైల్వే శాఖ కే చుక్కలు చూపించారు. బీహార్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలంద, తక్షశిల […]

Bihar Railway Theft: చిన్నప్పుడు మనం స్టువర్టుపురం దొంగల గురించి పుస్తకాల్లో చదివి ఉంటాం లేదా టీవీలలో చూసి ఉంటాం. స్టువర్టుపురం దొంగలనే గజదొంగలని.. కరుడుగట్టిన చోర శిఖామణులు అని అనుకుంటాం.. కానీ నేటి కాలంలో వారిని మించిపోయారు వీరు. వీరు చేసిన దొంగతనం అలాంటిది మరి.. ఏకంగా జాతీయస్థాయిలో చర్చకు దారి తీయడం మాత్రమే కాదు.. రైల్వే శాఖ కే చుక్కలు చూపించారు.

బీహార్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలంద, తక్షశిల వంటి విద్యాసంస్థలు ఉన్న ఆ ప్రాంతం.. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లోనే గుర్తింపు పొందింది.. కానీ ఇప్పుడు బీహార్ రాష్ట్రం లో అలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే అక్కడ దారిద్రం.. నిరక్షరాస్యత.. పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పైగా అక్కడ పాలకులకు ప్రజల కేవలం ఓటు వేసే యంత్రాలు మాత్రమే. అభివృద్ధి అంతగా అక్కడ కనిపించదు. అందువల్లే ప్రజలు దొంగతనానికి పాల్పడుతుంటారు

తాజాగా బీహార్ రాష్ట్రంలో ఒక చోరీ సంఘటన జరిగింది. అక్కడి దొంగలు ఏకంగా రైల్వే శాఖకు సంబంధించిన 25 వేల వోల్టుల ఓవర్ హెడ్ హై టెన్షన్ వైర్ చోరీ చేశారు. ఈ వైరులో 100 మీటర్లు కత్తిరించారు. ఫలితంగా సిగ్నల్.. కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సింగిల్ లైన్ లోనే రైళ్లను నడపాల్సి వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టుకు సమీపంలోనే ఈ దొంగతనం జరగడం విశేషం. ఈ రైల్వే లైన్ అత్యంత బిజీగా ఉంటుంది. ఈ మార్గం మీదుగా రైళ్ల రాకపోకలు విపరీతంగా సాగుతూ ఉంటాయి.

ఈ దొంగతనం వెలుగులోకి రావడంతో మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసరమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఇలాంటి దొంగతనం జరగడం ఇదే తొలిసారి. అంతటి విద్యుత్తు ఉన్నప్పటికీ.. సమీపంలోకి వెళ్తేనే ఒళ్ళు వణికే పరిస్థితి ఉన్నప్పటికీ.. దొంగలు ఇలా దొంగతనం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper