Rohit Naidu: ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, టైటిల్ విన్నర్ అయ్యేంత రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న రోహిత్ ని అన్యాయమా హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ చేసినప్పటి నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన రోహిత్ గురించే చర్చ నడుస్తోంది. రీ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు పెద్ద యుద్ధమే చేశారు కానీ,బిగ్ బాస్ టీం అందుకు అంగీకరించలేదు. అయితే చాలా కాలం తర్వాత రోహిత్ స్టార్ మా ఛానల్ లో కనిపించబోతున్నాడు. ఈ ఆదివారం ప్రసారమయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో ‘అగ్ని పరీక్ష 2 సక్సెస్ పార్టీ’ థీమ్ లో భాగంగా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అందరితో పాటు రోహిత్ కూడా పాల్గొంటాడు. ఈ షోలో నామినేషన్స్ ప్రక్రియ పెట్టారట. ఆ సమయంలో రోహిత్, అపూర్వ మధ్య చిన్న ఫైట్ జరిగిందని సమాచారం.
మరి వీళ్లిద్దరు ఏ విషయం లో గొడవ పడ్డారో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో లో యాంకర్ శ్రీముఖి రోహిత్ తో మాట్లాడుతూ , నీకు షాలిని మధ్య ఏమి జరుగుతోంది అని ప్రశ్నించగా, మా మధ్య ఉన్న బంధానికి ఎలాంటి పేరు పెట్టాలో తెలియడం లేదు , కానీ ఈ బంధం జీవితాంతం ఇలాగే ఉంటుంది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. మరోపక్క రోహిత్ ని ఆయన అభిమానులు ఇలాంటి స్థానంలో చూసి చాలా బాధపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ, టైటిల్ కొట్టే రేంజ్ ఉన్న కంటెస్టెంట్, ఇలా బయటకు వచ్చి స్టార్ మా పరివారం షోలో పాల్గొంటాడని కలలో కూడా ఊహించలేదని బాధపడుతున్నారు. ఇకపోతే ఈ షో అయిపోయిన వెంటనే అగ్నిపరీక్ష 2 కంటెస్టెంట్స్ అందరూ నీతూ మాస్టర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.