ఆస్ట్రియా దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దేశ రాజధాని వియన్నాలో ఆరు ప్రాంతాల్లో కొందరు ముష్కరులు రైపిళ్లతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఇది ఉగ్రదాడి అని ఓ వ్యక్తిని మట్టుబెట్టినట్లు ఆస్ట్రియా ఛాన్సలర్ కుర్జ్ తెలిపారు. మరో వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో వైపు వియన్నాలోని యూద మందిరం వద్ద కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 14 మంది గాయపడ్డారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించామని మేయర్ మైఖేల్ లుడ్‌విగ్ తెలిపారు.కాగా ఉగ్రదాడితో కలవరానికి గురి చేసిందని బ్రిటన్ ప్రధాని బోరిస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రియా ఛాన్సెలర్ సెబాస్టియర్ కుర్జ్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరాడుతామని, వారికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Terrorist attack in austria two killed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com