Homeజాతీయ వార్తలు Daily Needs Price  : సామాన్యులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న నిత్యవసర సరుకుల ధరలు.. కారణం...

 Daily Needs Price  : సామాన్యులకు షాకింగ్ న్యూస్.. పెరగనున్న నిత్యవసర సరుకుల ధరలు.. కారణం ఇదే…

Daily Needs Price : ఈ క్రమంలో పాక్ నుంచి రాక్ సాల్ట్ సరఫరా నిలిచిపోయింది. గత కొన్ని ఏళ్ల నుంచి మన దేశంలో రాక్ సాల్ట్ వాడకం బాగా పెరిగిపోయింది. రాక్ సాల్ట్ లో సోడియం తక్కువగా మరియు ముఖ్యమైన ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా ఇది హిమాలయాలలో ఉన్న కొండ ప్రాంతాలలో లభిస్తుంది. రాక్ సాల్ట్ పాకిస్తాన్లో ఉన్న ఖేవ్రా గని నుంచి ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుంది. మన దేశం కూడా రాక్ సాల్ట్ ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. కానీ గత కొన్ని రోజుల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత మన దేశ ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి కొన్ని రకాల దిగుమతులను నిషేధించింది. దీంతో అక్కడ నుంచి వచ్చే రాక్ సాల్ట్ సరఫరా కూడా నిలిచిపోయింది.

Also Read : ఆపరేషన్ సింధూర్ లో.. భారత సైన్యం ఆ తొమ్మిది స్థావరాలనే ఎందుకు టార్గెట్ చేసింది?

భారత ప్రభుత్వం మే 3, 2025 నుంచి పాకిస్తాన్ నుంచి కొన్ని రకాల దిగుమతులు అలాగే ట్రాన్సిట్లను తక్షణమే నిర్షేధిస్తున్నట్లు ప్రకటించింది. పహల్గాం దాడిలో మన దేశ ప్రజలు 26 మంది మరణించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనదేశానికి పాప ఖీవ్రా గని నుంచి దిగుమతి అయ్యే హిమాలయన్ పింక్ సాల్ట్ కూడా నిలిచిపోయింది. గతంలో మన దేశం పాకిస్తాన్ నుంచి ప్రతి ఏడాది 2500 నుంచి 3 వేల టన్నుల వరకు రాక్ సాల్ట్ దిగుమతి చేసుకునేది. పాకిస్తాన్ దేశం నుంచి 2018-19 సంవత్సరంలో దాదాపు 99.7 పర్సెంట్ మన దేశానికి రాక్ సాల్ట్ దిగుమతి జరిగింది. ప్రస్తుతం ఈ సడన్ బ్యాన్ కారణంగా రాక్ సాల్ట్ సప్లై పై తీవ్ర ప్రభావం పడింది.

మన దేశం పాకిస్తాన్ నుంచి దిగుమతులు నిలిచిపోయిన నేపథ్యంలో ఇతర దేశాల వైపు చూస్తుంది. ఈ క్రమంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఈ రాక్ సాల్ట్ దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. చాలా హై క్వాలిటీ రాక్ సాల్ట్ ఈ దేశాలలో దొరుకుతుంది. ఇరాన్ లో ఉన్న గర్మర్ గనులలో అలాగే ఆస్ట్రేలియాలో ఉన్న ముర్రే డార్లింగ్ బేసిన్ గనులలో పెద్ద మొత్తంలో రాక్ సాల్ట్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ దేశాల నుంచి రాక్ సాల్ట్ దిగుమతి చేసుకోవాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ దేశాలకు మధ్య ఉన్న దూరం మరియు లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వంటివి కూడా వీటి ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తాయి. మన దేశం 2023 డేటా ప్రకారం చూసుకుంటే ఇప్పటికే స్వల్పంగా ఈ దేశాల నుంచి రాక్ సాల్ట్ దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.

Also Read: పాక్‌ మీడియా బరితెగింపు.. అసత్యాలతో వాస్తవాల వక్రీకరణ

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular