MLA Vanama Venkateswara Rao: సాయం కోరి వస్తే.. ఓ కుటుంబాన్ని వేధించాడని, వారి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో ఈ ఏడాది జనవరిలో భారత రాష్ట్ర సమితికి చెందిన వనమా రాఘవ సస్పెన్షన్ కు గురయ్యాడు.. ఈ కేసు విషయంలో ఆయన మూడు నెలల పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తర్వాత కొద్ది రోజులపాటు ఏలూరులో ఉన్నాడు. ప్రస్తుతం కొత్తగూడెంలో ఉంటున్నప్పటికీ బయట ప్రపంచంలోకి రావడం లేదు. అయినప్పటికీ షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పుతున్నాడు.. ఈ పరిణామం వనమా వెంకటేశ్వరరావు రాజకీయ జీవితాన్ని సమాధి చేసిందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటుండగా.. మంగళవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు దానిని నిజం చేసింది.
జకీయ జీవితం సమాప్తమైనట్టేనా?
వనమా వెంకటేశ్వరరావు 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కూనంనేని సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో జలగం వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. అసలు అప్పుడే ఆయన రాజకీయ జీవితంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్సిపి లో చేరారు. అప్పటిదాకా వైఎస్ఆర్సిపి కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా వనమా తోడల్లుడు ఎడవల్లి కృష్ణ ఉండేవారు. అయితే వారిద్దరి మధ్య ఉన్న కుటుంబ తగాదాలవల్ల రాత్రికి రాత్రే జగన్ వద్దకు వెళ్లి కొత్తగూడెం బి ఫాం తెచ్చుకున్నారు. అప్పట్లో ఇది వివాదానికి దారితీసింది. వనమా తనకు రావలసిన బీఫామ్ తెచ్చు కోవడంతో ఎడవల్లి కృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. అయినప్పటికీ వనమా మనసు కరగలేదు. అయితే ఆ ఎన్నికల్లో జలగం వెంకట్రావు చేతిలో వనమా ఓడిపోయాడు.
2018లో..
2018 ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి.. మళ్లీ తన తోడల్లుడు ఎడవల్లి కృష్ణ ( 2014 నుంచి కొత్తగూడెం ఇన్చార్జిగా కొనసాగుతున్నారు) కు టికెట్ దక్కకుండా చేసి బి ఫాం తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా 2014 స్టోరీ రిపీట్ అయింది. అయితే 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి జలగం వెంకట్రావు మీద గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే భారత రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు వనమా వెంకటేశ్వరరావు. ఆ తర్వాత వనమా వెంకటేశ్వరరావు పెద్ద కొడుకు వనమా రాఘవ కొత్త గూడెం నియోజకవర్గానికి సంబంధించి షాడో ఎమ్మెల్యేగా మారాడు. పలు వ్యవహారాల్లో తల దూర్చాడు. భూముల అక్రమణ, అధికారుల నుంచి వసూళ్లు వంటి ఆరోపణలు అతడి మీద ఉన్నాయి.. ఓ కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారంలో కలగజేసుకోవడంతో ఓ వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.. ఫలితంగా పార్టీ నుంచి వనమా రాఘవను బీఆర్ఎస్ సస్పెన్షన్ చేసింది.
తప్పుడు వివరాలు
ఇక 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫీడవిట్ లో తప్పుడు వివరాలు నమోదు చేశారు. తన మీద ఉన్న కేసులను ఆయన ప్రస్తావించలేదు. తనకున్న ఆస్తులను తక్కువగా చేసి చూపించారు. అన్నింటికీ మించి ఆంధ్రప్రదేశ్ చీరాలలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ వివరాలను పొందుపరచలేదు. ఈ విషయాలను ఉటంకిస్తూ జలగం వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదలాయించడంతో సుదీర్ఘ విచారణ అనంతరం వనమా వెంకటేశ్వరరావు మీద అనర్హత వేటు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఒకే ఏడాదిలో అటు తండ్రి, ఇటు కొడుకు తమ రాజకీయ జీవితాలను శాశ్వతంగా సమాధి చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం లేకపోవడంతో వనమా వెంకటేశ్వరరావు రాజకీయంగా విశ్రాంతి తీసుకోవడమే మేలని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Interesting facts about the political life of vanama venkateswara rao
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com