Mahesh Kumar Goud : ఇటీవల తెలంగాణ ప్రభుత్వం(Telangana government) కుల గణన(caste census) నిర్వహించింది. ఈ గణన(census) లో బీసీలు(backward caste) ఎక్కువ ఉన్నట్టు తెలింది. అయితే గతంలో చేసిన సర్వే(survey)లో బీసీల సంఖ్య పెరగగా.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం(Congress government tenure)లో చేసిన సర్వే(survey)లో బీసీల సంఖ్య తగ్గడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం అయింది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసిన సర్వేను తప్పుపట్టాయి. కావాలని బీసీల సంఖ్యను తగ్గించి చూపించారని, ఓసీల సంఖ్యను ఎక్కువ చేశారని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ సర్వే నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. దీంతో ప్రభుత్వం మళ్ళీ సర్వే నిర్వహించడానికి ఒప్పుకుంది. సర్వే మళ్లీ నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అదే స్థాయిలో స్పందించింది.. ప్రభుత్వం సర్వే చేస్తున్నప్పుడు కేసీఆర్ (KCR), కేటీఆర్(KTR) ఎందుకు వివరాలు ఇవ్వలేదని మండిపడింది. ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వే పత్రాలను కెసిఆర్, కేటీఆర్ లకు పంపించారు.. దమ్ముంటే వివరాలు ఇవ్వాలని సవాల్ విసిరారు. మీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ఆ వివరాలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. పొన్నం విసిరిన ప్రశ్నలకు భారత రాష్ట్ర సమితి వద్ద సమాధానాలు లేకుండా పోయాయి. అంతకుముందు బీసీ గర్జనలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓ సామాజిక వర్గంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. చివరికి తెలంగాణకు చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆయన చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. దీనిని రెడ్డి సామాజిక వర్గం కూడా ఖండించింది.
ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు వంతు
తెలంగాణలో కులగణన నిర్వహించాలనేది రాహుల్ గాంధీ ఆకాంక్ష. గతంలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కుల గణన తర్వాత వచ్చే రిజర్వేషన్ ఆధారంగానే.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది తేలిపోతుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. ” ఈ ఐదు సంవత్సరాలే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు కావచ్చు. కుల గణన తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారు.. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టాలనేది రాహుల్ గాంధీ ఆకాంక్ష. రాహుల్ గాంధీ ఆకాంక్షకు అనుగుణంగానే మేము పనిచేశాం. ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టింది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ధైర్యం చేశారు. చివరికి తన పదవికి ముప్పు అని తెలిసినప్పటికీ ముందుకు వచ్చారు. అటువంటి ముఖ్యమంత్రిని కలలో కూడా తెలంగాణ రాష్ట్రం చూడదని” మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలలో కొన్ని బిట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భారత రాష్ట్ర సమితి వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టింది. భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రచారానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి వ్యాఖ్యలు చేస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
బ్రేకింగ్ న్యూస్
ఈ 5 సంవత్సరాలే రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు
భవిష్యత్తులో తెలంగాణలో బీసీ సీఎం అవుతారు
వచ్చే రోజుల్లో రాజకీయాలు అన్నీ బీసీ చుట్టూ తిరుగుతాయి – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ pic.twitter.com/3wAwIskP9n
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2025