Homeజాతీయ వార్తలుWomen Reservation Bill India: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయింది.. మోడీ ప్రభుత్వం పడిపోతుందా.. అసలు...

Women Reservation Bill India: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయింది.. మోడీ ప్రభుత్వం పడిపోతుందా.. అసలు కథ ఇప్పుడే కదా మొదలైంది

Women Reservation Bill India: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోలేదు. మోడీ ప్రభుత్వం డిలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు కలిపి పార్లమెంటు ముందుకు తీసుకువచ్చాయి. ప్రతిపక్షాలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాయి. అన్ని ఒకే తాటి మీదికి వచ్చాయి. మరో మాటకు తావు లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గట్టి స్ట్రోక్ ఇచ్చాయి.. ఈ దేశంలో నరేంద్ర మోడీ ఏకపక్ష విధానాలను ఎండగట్టాలంటే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఉండాలి. రాహుల్ గాంధీ చేసిన పని అదే.. […]

Women Reservation Bill India: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోలేదు. మోడీ ప్రభుత్వం డిలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు కలిపి పార్లమెంటు ముందుకు తీసుకువచ్చాయి. ప్రతిపక్షాలు అత్యంత చాకచక్యంగా వ్యవహరించాయి. అన్ని ఒకే తాటి మీదికి వచ్చాయి. మరో మాటకు తావు లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గట్టి స్ట్రోక్ ఇచ్చాయి.. ఈ దేశంలో నరేంద్ర మోడీ ఏకపక్ష విధానాలను ఎండగట్టాలంటే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఉండాలి. రాహుల్ గాంధీ చేసిన పని అదే.. బలమైన ప్రతిపక్షం ఉంటేనే.. అధికార పక్షం ఆగడాలు ఆగిపోతాయి. నిన్నటి నుంచి మీడియా లో వార్తలు ఇలానే వస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

మీడియా చెప్తుంది కొంతవరకు నిజమే అనుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు వాస్తవాన్ని పక్కన పెడుతున్నారు.. నిజంగా పార్లమెంట్లో ఏం జరిగింది.. మహిళ రిజర్వేషన్ బిల్లు ఆగిపోయింది.. బిల్లు ఆగిపోయింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుందా? ఎన్డీఏ ప్రభుత్వానికి కష్టకాలం మొదలైనట్టేనా.. వాస్తవానికి ఇక్కడ బిజెపి బలం తగ్గలేదు. ప్రభుత్వం మెజారిటీ కోల్పోలేదు. గతంతో పోల్చి చూస్తే ఈసారి బిజెపికి ఆరు ఓట్లు పెరిగాయి. ఇక్కడ రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ లేదు. కానీ ఇక్కడే అసలు విషయం ఒకటి ఉంది.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుసార్లు రాజ్యాంగ సవరణనను విజయవంతంగా చేపట్టింది. అప్పుడు మెజారిటీ ఉన్నప్పుడు ఇప్పుడేమైంది.. చివరికి రాష్ట్రాల అధికారాలను నామమాత్రం చేసి.. జీఎస్టీ ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ సాధ్యమైంది. అప్పుడు మెజారిటీ లభించడానికి నరేంద్ర మోడీ చాక చక్యాన్ని ప్రదర్శించారు. ముందుగానే అందరి నేతలతో మాట్లాడి ఒప్పించారు. మద్దతు సాధించారు.

ఇప్పుడు నరేంద్ర మోడీ నిశ్శబ్దంగా ఉన్నారు. దేశ మహిళలకు లేఖ రాసి.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఉద్దేశం గురించి చెప్పారు. కానీ ఇప్పుడు మాట్లాడలేదు.. ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది. రాజకీయాలలో పెళ్లి, చావు, విందు, వివాదం.. ఏది చూసుకున్నా సరే రాజకీయమే ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు మెజారిటీ లేదనే విషయం బిజెపికి తెలుసు. కానీ ఇక్కడే బిజెపి రాజకీయాన్ని మొదలుపెట్టింది. ఆర్టికల్ 370 ని జస్ట్ కాంట్రాక్టు ఉద్యోగి మాదిరిగా తీసి అవతల పడేసింది. నాడు అంత బలం ఉన్న బిజెపికి.. ఇప్పుడు పార్లమెంట్లో తమ సత్తా ఏమిటో తెలియదా.. ఏం జరుగుతుందో తెలియదా..

సాధారణంగానే గుజరాతి నేపథ్యం ఉన్నవారు అన్ని లెక్కలు వేసుకుంటారు. ప్రతిదీ వాళ్లకు ఒక కోణంలో ఉంటుంది. కొన్నిసార్లు ఆ లెక్కలకు జవాబులు ఎన్నికల ఫలితాల్లో ఉంటాయి. ఆ ఫలితాల్లోనే వాటిని చూసుకుంటారు. ఇది ప్రతిపక్ష విజయం అని మీడియా గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ.. రేపటి ఎన్నికల్లో విజయం కోసమే బిజెపి పార్లమెంట్లో తగ్గింది. తలవంచింది. స్థూలంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ లాంటివాళ్ళు నరేంద్ర మోడీకి లెక్కలు నేర్పాలని చూస్తే.. ఆ తర్వాత నరేంద్ర మోడీ నేర్పించే లెక్కలు వేరే విధంగా ఉంటాయి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper