Homeవార్త విశ్లేషణTromelin Island Slaves Story: ట్రోవెలిన్‌ దీవిలో బానిసల గాధ.. 15 ఏళ్లు జీవన పోరాటం

Tromelin Island Slaves Story: ట్రోవెలిన్‌ దీవిలో బానిసల గాధ.. 15 ఏళ్లు జీవన పోరాటం

Tromelin Island Slaves Story: విధి ఎప్పుడు ఎలాంటి ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎవరి తలరాతను ఎలా మారుస్తుందో అంతు చిక్కదు. సరైన తిండి ఆహారం లేక దుర్భర జీవితం గడుపుతున్న ఆప్రికన్ల జీవితంతో విధి 15 ఏళ్లు ఆడిన నాటకం అందరినీ కదిలిస్తుంది. 1761 జూలై 31న ఫ్రెంచ్‌ వాణిజ్య నౌక ’లూటిల్‌’ మడగాస్కర్‌ నుంచి మారిషస్‌కు 160 మంది ఆఫ్రికన్‌ బానిసలతో ప్రయాణిస్తూ ట్రోవెలిన్‌ దీవి దిబ్బలపై ఢీకొట్టి మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 122 మంది నావికులు, 60 మంది బానిసలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చిన్న దీవిలో చిక్కుకున్న ఈ బానిసలు 15 సంవత్సరాల పోరాటం తర్వాత 1776లో రక్షించబడ్డారు.

ప్రమాద సంఘటన వివరాలు
కెప్టెన్‌ జీటీ.లావక్, నావిగేటర్‌ కెస్టలిన్‌ మార్గదర్శకత్వంలో 142 మంది ఫ్రెంచ్‌ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓడ తుఫానులో దీవి రాళ్లను తాకింది. మడగాస్కర్‌ నుంచి 570 కిలోమీటర్ల దూరంలో 1.7 కి.మీ. పొడవు, 700 మీ. వెడల్పు ఉన్న ఈ దీవి చెట్లు, తాగునీరు లేని ఎండిపొర్లు. ఓడ అడుగుభాగంలో ఉన్న బానిసలు మొదటే మరణించారు.

మూడు నెలల తర్వాత..
ప్రాణాలతో బయటపడిన నావికులు బానిసలను ఓడ నుంచి సామగ్రి తీసుకురావడానికి ఆదేశించి రెండు గంటలు శ్రమపడ్డారు. ఆహారం పదకొన్ని రోజులకు సరిపోదని గ్రహించి రోజుకు ఒక్క పూట ఆహారం పంచారు. మంచినీరు అయిపోతుంటే బానిసలు ఇసుకలో తవ్వి తడి మట్టి, ఊటలు కనుగొన్నారు. రెండు నెలల శ్రమతో నావికులు కొత్త పడవ తయారు చేసి వెళ్లిపోయారు, ‘మళ్లీ వస్తాము‘ అని మాట ఇచ్చి బానిసలను వదిలేశారు.

15 ఏళ్ల సహన వ్యూహాలు

కొన్నాళ్ల తర్వాత తమను కాపాడేందుకు ఎవరూ రారని అర్థమైంది. తమ ప్రాణాల కోసం తామే పోరాడాలని గ్రహించారు. జీవించడానికి మార్గాలు వెతకడం ప్రారంభించారు. నీటికోసం తవ్విన గుంతలే జీవనాధారంగా మారాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి గుంతను మరింత లోతుగా తవ్వారు. నివాసానికి చిన్న చిన్న గుడారాలు కట్టుకున్నారు. ఒడ్డుకు వచ్చే చిన్న తాబేళ్లు, సముద్రపు పక్షులను ఆహారంగా తీసుకున్నారు. పెద్ద చేపల కోసం అలలు వచ్చే చోట రాళ్లతో నిర్మాణాలు చేశారు. తాబేళ్ల ముక్కలు, చేపలు చెరగా వేసి పెద్ద చేపలు పట్టేవారు. ఇలా దొరికినవాటిని ఎండబెట్టి భవిష్యత్‌ కోసం నిల్వ చేసుకున్నారు. రోజుకు ఒకరు ఓడ కోసం కాపలా కాయాలి. కొందరు నీటిని జాగ్రత్తగా చూసుకోవాలి, కొందరు వలలు తయారు చేయడం, కొందరు చేపలు పట్టడం, మరికొందరు వృద్ధులు, జబ్బుపడినవారిని చూసుకోవడం, చేశారు. అంతా ఇక అదే తమ నివాసంగా నిర్ణయించుకున్నారు. కన్నేళ్ల తర్వాత కొందరు మరో చిన్న పడవలు తయారు చేసి మడగాస్కర్‌కు వెళ్లినవారు సముద్రంలో మునిగిపోయారు.

రక్షణ ప్రయత్నాల వైఫల్యాలు
నావికులు మారిషస్‌ చేరి గవర్నర్‌కు తెలిపారు, కానీ సెవెన్‌ ఇయర్స్‌ వార్‌ పోరాటాల వల్ల సహాయం రాలేదు. 11 ఏళ్ల తర్వాత ఒక నావికుడు రాసిన లేఖ కొత్త గవర్నర్‌ చేతికి చేరింది. మొదటి రెస్క్యూ ఓడ విఫలమైంది. అనారోగ్యం, ఆకలికి చాలామంది చనిపోయారు.

1776లో అద్భుత రక్షణ
నవంబర్‌ 29, 1776న ఫ్రెంచ్‌ ఓడ చేరుకుని ఏడు మంది మహిళలు, ఒక పసి బిడ్డను కనుగొన్నారు. ఎండిన చేపలు, నీటి గుంటలు, చిన్న గూళ్లు చూసి ఆశ్చర్యపోయారు. వారిని మారిషస్‌ తీసుకెళ్లి భద్రత కల్పించారు. గవర్నర్‌ స్వాగతం పలికారు.

ఈ సంఘటన మానవ సహన శక్తి, సమూహ సహకారానికి అద్భుత ఉదాహరణ. బానిసత్వ వివక్ష వల్ల నావికులు వారిని వదిలేసిన చర్య నీతి ప్రశ్నలు లేవనెత్తుతుంది. 15 ఏళ్ల పోరాటం ఆఫ్రికన్‌ బానిసల స్వాతంత్య్ర స్పహను చాటింది. ఆధునిక కాలంలో ఈ కథ స్ఫూర్తి, మానవత్వం గురించి ఆలోచింపజేస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular