spot_img
Homeజాతీయ వార్తలుKCR Maharashtra : మరాఠా కేసీఆర్‌ను ఎత్తుకుంటుందా.. ఎత్తేస్తుందా!?

KCR Maharashtra : మరాఠా కేసీఆర్‌ను ఎత్తుకుంటుందా.. ఎత్తేస్తుందా!?

KCR Maharashtra : దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ (భారత్‌ రాష్ట్ర సమితి) పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఖమ్మంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభతో దేశం చూపును తన వైపు తిప్పుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌.. రాష్ట్రం బయట పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌లో మరో సభకు సిద్ధమయ్యారు.

2024 ఎన్నికలే టార్గెట్‌
2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాందేడ్‌ సభ నిర్వహిస్తున్నారు. సుమారు గంటపాటు సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. ఇందులో జాతీయ రాజకీయాలు, దేశంలో ప్రస్తుత పరిస్థితులు, బీజేపీ వైఫల్యాలను ఎండగడతారని తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ మోడల్‌ను ఆవిష్కరిస్తారని బీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై కూడా మాట్లాడతారని తెలుస్తోంది.

భారీ జన సమీకరణకు ప్లాన్‌..
నాందేడ్‌ సభకు భారీ జన సమీకరణకు బీఆర్‌ఎస్‌ నేతలు కసరత్తు చేశారు. నాందేడ్‌ జిల్లాలోని సౌత్, నార్త్, బోకర్, నాయిగాం. ముథ్‌ఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్‌ మండలాల నుంచి కూడా భారీ జనసమీకరణ చేశారు. మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఆదిలాబాద్, బోథ్, మథోల్, నిర్మల్, నిజామాబాద్, బోధన్‌ నియోజవర్గాల నుంచి నాందేడ్‌ సభకు గులాబీ శ్రేణులు ఇప్పటికే తరిలాయి. సుమారు రెండు లక్షల మంది సభకు హాజరయ్యేలా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఫ్లెక్సీలు, తోరణాలతో నాందేడ్‌ దారులన్నీ పూర్తి గులాబీ మయమయ్యాయి.

మరాఠాలో మరో పార్టీకి చోటుందా?
బీఆర్‌ఎస్‌ ఇంత ప్రయత్నం చేస్తున్నా.. మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మరో పార్టీకి చోటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దాదాపు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సమయంలోనే మరాఠాలో సీనియర్‌ కాంగ్రెస్‌నేత శరద్‌పవార్‌ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టారు. ఇప్పటికీ సొంతంగా అధికారంలోకి రాలేదు. కాకపోతే ప్రభావం చూసేస్థాయికి ఎదిగారు. ఇక 20 ఏళ్లుగా బీజేపీ, శివసేన మైత్రి ఇక్కడ కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోలనూ కలిసే పోటీ చేసినప్పటికీ ఉద్ధవ్‌థాక్రే అధికార కాంక్ష మిత్రపక్షంలో చీలిక తెచ్చింది. శివసేన సిద్ధాంతాని వ్యతిరేకంగా ఉద్ధవ్‌ కాంగ్రెస్, ఎన్‌సీపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ ఆ సంకీర్ణ ప్రభుత్వం ఏడాదిన్నరకే కూలిపోయింది. శివసేనలోనే ముసలం పుట్టి ఏక్‌నాథ్‌శిండే వర్గం బయటకు వచ్చింది. బీజేపీ మద్దతులో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇపుపడు మరాఠాలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీతోపాటు ఏక్‌నాథ్‌షిండే సారథ్యంలోని శివసేన చీలికవర్గం ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు వీటికి అదనం. ఇలాంటి పరిస్థితిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరాఠాలను ఎలా మెప్పిస్తారు.. మరాఠాలు ఎంతవరకు కొత్త పార్టీని ఆదరిస్తారు అనేది వేచిచూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper