Homeజాతీయ వార్తలుTVK Vijay Master Stroke: టీవీకే విజయ్ మాస్టర్ స్ట్రోక్.. స్టాలిన్ కు దిమ్మ తిరిగి...

TVK Vijay Master Stroke: టీవీకే విజయ్ మాస్టర్ స్ట్రోక్.. స్టాలిన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది..

TVK Vijay Master Stroke: “అతడికి అనుభవం లేదు. సినిమా కథానాయకుడు. రంగులు పూసుకొని మొన్నటిదాకా తెరమీద కనిపించాడు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను అర్థం చేసుకోగలుగుతాడా.. తమిళనాడు ప్రజలకు అర్థవంతమైన పరిపాలన అందించగలుగుతాడా.. అతడికి ఆ స్థాయి ఉందా.. ఓటు వేసే ముందు తమిళ ప్రజలు ఆలోచించుకోవాలి” ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. వాస్తవానికి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ని అటు డీఎంకే గాని.. ఇటు అన్న […]

TVK Vijay Master Stroke: “అతడికి అనుభవం లేదు. సినిమా కథానాయకుడు. రంగులు పూసుకొని మొన్నటిదాకా తెరమీద కనిపించాడు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను అర్థం చేసుకోగలుగుతాడా.. తమిళనాడు ప్రజలకు అర్థవంతమైన పరిపాలన అందించగలుగుతాడా.. అతడికి ఆ స్థాయి ఉందా.. ఓటు వేసే ముందు తమిళ ప్రజలు ఆలోచించుకోవాలి” ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

వాస్తవానికి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ని అటు డీఎంకే గాని.. ఇటు అన్న డీఎంకే గాని ఏ మాత్రం పట్టించుకోలేదు. తామే ప్రత్యర్ధులం అన్నట్టుగా రెండు పార్టీలు వ్యవహరించాయి. ఒక పార్టీ మీద మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకున్నాయి. తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నాయి. కానీ విజయ్ ని ఒక పోటీ దారుగా కూడా చూడలేదు. కానీ విజయ్ చేయాల్సింది మొత్తం చేసేసాడు. చాప కింద నీరు లాగా విస్తరించి తమిళనాడు రాజకీయాలలో సరికొత్త ధ్రువతారగా ఆవిర్భవించాడు.

విజయ్ కి రాజకీయ అనుభవం లేదని స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలు నిజం కాదని.. తాను అంతకుమించిన అనుభవశాలి అని నిరూపించాడు విజయ్. ఇప్పటికే తాను అధికారంలోకి రావడానికి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి విజయ్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. భావ సారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఏకంగా ముఖ్యమంత్రి పీఠం మీద దర్జాగా కూర్చున్నాడు. సంచలన నిర్ణయాలతో తమిళనాడు రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాడు. ఇక్కడితోనే విజయ్ ఆగిపోవడం లేదు. విజయ్ మాస్టర్ స్ట్రోక్ తమిళ్ రాజకీయాల్లోనే కాదు.. అక్కడి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేస్తోంది.

తమిళనాడు రాజకీయాలలో స్టాలిన్ కు మొదటి నుంచి కూడా ఐయూఎంఎల్ సపోర్ట్ ఇస్తోంది. డీఎంకే పార్టీకి 64 సంవత్సరాలుగా ఐయూఎంఎల్ బలమైన భాగస్వామిగా ఉంది. ఈ బంధానికి విజయ్ బ్రేక్ వేశాడు. 1962 లో డిఎంకెతో ఐయూఎంఎల్ చేతులు కలిపింది. ప్రతి ఎన్నికలోనూ డిఎంకెతో కలిసి చేతులు కలిపింది. అయితే ఇటీవరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపాలైంది. టీవీకే అధికారంలోకి వచ్చింది. అదే కాదు టీవీ కేకు ఐయూఎంఎల్ సపోర్ట్ చేసింది. ఐయూఎంఎల్ నేత షాజహాన్ కు మంత్రి పదవి దక్కింది. ఇలా తన వ్యూహ చతురతతో విజయ్ ఏకంగా 64 ఏళ్ల బంధానికి బ్రేక్ వేశాడు. రాజకీయాలలో తాను చైల్డ్ ఆర్టిస్ట్ ను కాదని.. మాన్ స్టార్ ను అని నిరూపించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper