అంతర్జాతీయంఅమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ...

అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ…

నోవెల్‌ కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో… అగ్రరాజ్యం అమెరికా జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవంక, భారత దేశంలో వీసాలు జారీ చేయడాన్ని అమెరికా ప్రస్తుతానికి నిలిపివేసింది.

కరోనా నియంత్రణకు ఫెడరల్‌ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెబుతూ నేషనల్‌ ఎమర్జెన్సీని అధికారికంగా ప్రకటిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. వైరస్‌ నియంత్రణకు 50 బిలియన్‌ డాలర్ల నిధిని కేటాయిస్తున్నట్లు చెప్పారు. రిలీఫ్‌ ప్యాకేజీ గురించి ఉభయసభల్లో ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని అవరోధాలను అధిగమిస్తామని భరోసా వ్యక్తం చేశారు. ఎలాంటి వనరులను కూడా వదిలేది లేదని స్పష్టం చేశారు. తన ఆదేశాల మేరకు కార్నివాల్‌, రాయల్‌ కరేబియన్‌, నార్వేయన్‌, ఎంఎస్‌సీ లాంటి క్రూయిజ్‌లను 30 రోజుల పాటు నిలిపేసినట్లు ట్రంప్‌ తెలిపారు.

కాగా, భారత్‌లో అన్ని అమెరికా కాన్సులేట్లను మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కరోనా ధాటికి వణికిపోతున్న అమెరికా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇప్పటికే యూరప్‌కు రాకపోకలను నిషేధించింది. తాజాగా భారత్‌లో ఉన్న అన్ని అమెరికా కాన్సులేట్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

సోమవారం నుంచి అన్ని రకాల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నామని, వీసా ప్రాసెస్‌ రీ షెడ్యూల్‌ చేసుకోవాలని కోరింది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికన్‌ ఎంబసీ ప్రకటించింది. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు వీసా సర్వీసులు అందుబాటులో ఉండవని పేర్కొంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతి..

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...

Trump Family : ట్రంప్‌ ఫ్యామిలీపై ట్రెహాన్ వేదికగా సంచలన పరిణామం

Trump Family : రాయలసీమ ఫ్యాక్సనిజంలో రక్తానికి రక్తం అన్నట్లుగా ఒకప్పుడు హత్యలు జరిగేవి. కుటుంబాలనే మట్టుబెట్టేవారు. అయితే క్రమంగా హింస పరిష్కారం కాదని మారుతున్న తరాలకు అర్థమైంది. కఠిన శిక్షలే కూడా...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Indus Water Dispute

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...
Maho Beach

Maho Beach: విమానం టేకాఫ్.. భయంకరమైన గాలులు.. పర్యాటకులు ఎగిరిపడ్డారు.. వైరల్ వీడియో

Maho Beach: వాతావరణం ఆహ్లాదంగా ఉంది.. మబ్బులు కమ్ముకున్నాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతున్నాయి. పర్యాటకులు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు. నచ్చిన ఫుడ్ తింటు ఎంజాయ్ చేస్తున్నారు....
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...