జాతీయ వార్తలుToll Charges: ఇక ‘టోల్‌’ బాదుడు.. జూన్‌ 2 నుంచి పెరగనున్న చార్జీలు!

Toll Charges: ఇక ‘టోల్‌’ బాదుడు.. జూన్‌ 2 నుంచి పెరగనున్న చార్జీలు!

Toll Charges: జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్‌ చార్జీలు పెంచాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. ఏటా ఏప్రిల్‌ 1న రుసుము పెంచుతోంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. జూన్‌ 1న పోలింగ్‌ ముగియనుండడంతో అదే రోజు అర్ధరాత్రి(జూన్‌ 2) నుంచి చార్జీలు పెంచాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఈమేరకు టోల్‌ ప్లాజాల నిర్వాహకులకు ఎన్‌హెచ్‌ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది.

5 శాతం పెంపు..
ఇక టోల్‌ చార్జీల పెంపు ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తంపై 5 శాతం పెరగనున్నాయి. ఒక వాహనానికి రూ.100 వసూలు చేస్తుంటే దానిపై 5 శాతం అంటే రూ.5 పెరిగి జూన్‌ 2 నుంచి రూ.105 వసూలు చేస్తారు. అప్‌అండ్‌డౌన్‌ చార్జీలు రూ.210 వసూలు చేస్తారు. గతంలో కారు, ప్యాసింజర్‌ వ్యాన్‌లతోపాటు లైట్‌ కమర్షియల్‌ వాహనాల టోల్‌ రుసుము పెంచలేదు. రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నారు.

తెలంగాణలో 28 టోల్‌ప్లాజాలు..
తెలంగాణ రాష్ట్రం మీదుగా వెళ్తున్న వివిధ జాతీయ రహదారులపై మొత్తం 28 టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. గతంలో 60 కిలో మీటర్లకు ఒక టోల్‌ ప్లాజా మాత్రమే ఉండేలా చూస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో కొన్ని మూతపడతాయని భావించారు. కానీ, అది అమలు చేయకపోవడంతో 28 టోల్‌ ప్లాజాలు కొనసాగుతున్నాయి. పెరగనున్న చార్జీలతో వాహనదారులపై భారం పడనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Toll Charges On Bikes: దేశంలో బైక్ లున్న వారందరికీ షాకింగ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Toll Charges On Bikes ఒకప్పుడు సైకిల్ ల మీద చాలామంది ప్రయాణాలు సాగించేవారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంటికొక సైకిల్ అయితే ఎలా ఉండేదో.. ఇప్పుడు బైక్ అలా మారిపోయింది.

Toll Charges: హైవే ల పై టోల్ బాదుడును తప్పించుకోండిలా?

Toll Charges హైవేల మీద ప్రయాణం సుఖవంతంగానే ఉంటుంది. టోల్ బూత్ దగ్గరికి వస్తేనే ఆ సుఖం స్థానంలో నిట్టూర్పు వస్తుంది. అందుకే టోల్ బూత్ దగ్గరికి రాగానే వాహనాలను బ్యాక్ రోడ్డు కు మల్లిస్తే టోల్ బాధ నుంచి తప్పించుకోవచ్చు.

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...
Oktelugu Epaper