Toll Charges On Bikes: ఒక రకంగా బైక్ అనేది కచ్చితంగా ఉండాలనే స్థాయికి ఎదిగింది. ద్విచక్ర వాహనాల మీద ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరిగిపోవడంతో వాటిని.. కొనుగోలు చేసేవారు ఎక్కువయ్యారు. అందువల్లే ద్వి చక్రవాహన తయారీ కంపెనీలు రోజుకొక కొత్త నమూనాను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇందులో మైలేజ్ పరంగా.. స్టైల్ పరంగా.. పికప్ పరంగా.. సామర్థ్యంపరంగా వాహనాలను రూపొందిస్తున్నాయి. దీంతో ఎవరికి నచ్చిన వాహనాన్ని వారు కొనుగోలు చేస్తున్నారు. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అయితే మన దేశంలో ద్విచక్ర వాహనాల మార్కెట్ వేలకోట్లలో ఉంది. ద్విచక్ర వాహనాలు అందుబాటు ధరలో ఉండడంతో చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు..
Also Read: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి కట్టప్ప ను తీసేసిన స్టార్ డైరెక్టర్…ఇది కదా అభిమానం అంటే..?
రుసుము చెల్లించాల్సిందే..
ద్విచక్ర వాహనాలను దూర ప్రయాణాలకు కూడా చాలామంది వాడుతున్నారు. ఇదే క్రమంలో జాతీయ రహదారులలో టోల్ ప్లాజా లలో ద్విచక్ర వాహనాలకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం అంతకుమించి ఎక్కువ చక్రాలు ఉన్న వాహనాలు మాత్రమే టోల్ ప్లాజాలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఇదే నిబంధన కొనసాగింది. అయితే ఇకపై జాతీయ రహదారులలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా టోల్ చెల్లించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర రహదారుల శాఖ ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ నిబంధన కనుక అమల్లోకి వస్తే కార్లు, ఇతర పెద్ద వాహనాల మాదిరిగానే ద్విచక్ర వాహనాలు నడిపేవారు కూడా ఫాస్టాగ్ ద్వారా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిపై ద్విచక్ర వాహనదారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ద్విచక్ర వాహనదారులకు మొదటి నుంచి కూడా టోల్ మినహాయింపు ఉంది. పైగా రహదారులపై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేది చాలా తక్కువ. అయితే ఇంకా దానికంటే భిన్నంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఓ నివేదిక ప్రకారం మనదేశంలో ద్విచక్ర వాహనాలను ఉపయోగించేవారు కోట్లల్లో ఉంటారు. ఇందులో మెజారిటీ శాతం జాతీయ రహదారుల మీదుగా ప్రయాణాలు సాగిస్తారు. స్థానికంగా ఉన్నవారు కూడా ఇతర నగరాలు వెళ్లడానికి జాతీయ రహదారుల మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. ద్విచక్ర వాహనాలు వాడేవారు సాధ్యమైనంతవరకు మధ్యతరగతి కుటుంబ నేపథ్యానికి చెందిన వారై ఉంటారు. అలాంటివారు టోల్ చెల్లించాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. పైగా ఇంధనం ధరలు కూడా అధికంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద చార్జీలు పెంచింది. అలాంటప్పుడు ద్విచక్ర వాహన దారులు ఇలా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణ సాగిస్తూ ఫీజు చెల్లించడం ఒక రకంగా ఆర్థికంగా ఇబ్బందే. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.