HomeతెలంగాణTelangana Geetam: తెలంగాణ రాష్ట్రగీతం ఖరారు.. జూన్‌ 2న ఆవిష్కరణ

Telangana Geetam: తెలంగాణ రాష్ట్రగీతం ఖరారు.. జూన్‌ 2న ఆవిష్కరణ

Telangana Geetam: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తికావస్తోంది. కానీ, ఇప్పటి వరకు రాష్ట్రానికి సొంత గేయం అధికారికంగా నిర్ణయించలేదు. రాష్ట్ర వృక్షం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర అధికారిక లోగో, అధికారిక భాషను నిర్ణయించిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర గేయాన్ని మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర గేయాన్ని ఖరారు చేసింది. దీనిని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్‌ 2న ఆవిష్కరించాలని నిర్ణయించింది.

రాష్ట్ర గేయం ఇదే..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలు ఊగించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే జూన్‌ 2 నాటికి తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా..
రాష్ట్ర గీతం తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా, అస్తిత్వ ప్రతీకగా, ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా, సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాశారు. ఈ గీతం నిడివి 6 నిమిషాలు ఉంటుంది. అందులో మార్పులేమీ చేయకుండా.. యథాతథంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, దేశవిదేశీ ప్రముఖులు హాజరైన సందర్భాల్లో వినియోగించడానికి వీలుగా గీతాన్ని 60 నుంచి 90 సెకన్ల నిడివి మించకుండా రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రధాన గీతంలోని భావోద్వేగాలను అలాగే కొనసాగిస్తూ నిడివి తగ్గించేందుకు అందెశ్రీకి పూర్తి స్వేచ్ఛ, బాధ్యత, అధికారం అప్పగించారు.

కీరవాణి సంగీతం..
ఇక రాష్ట్ర గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తే బాగుంటుందని అందెశ్రీ సూచించారు. ఈమేరకు ఆస్కార్‌ అవార్డు గ్రహీత కీరవాణి కూడా ముందుకు వచ్చారు. గీతాన్ని కుదించేందుకు అందెశ్రీతో కలిసి పనిచేస్తున్నారు. ఈమేరకు ఇద్దరూ మంగళవారం(మే 21న) సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి చర్చించారు. జూన్‌ 2 నాటికి ప్రధాన గీంతంతోపాటు తక్కువ నిడివితో కూడిన గీతాన్ని సిద్ధం చేయాలని సీఎం సూచించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper