spot_img
Homeఆంధ్రప్రదేశ్‌విద్యార్థులకు జగనన్న కానుక ఇదీ..

విద్యార్థులకు జగనన్న కానుక ఇదీ..

jagan school

ఎన్నాళ్ల గానో ఎదురుచూపు.. మరెన్నో కష్టాలు.. ఇంకెన్నో బాధలు.. వీటన్నింటినీ ఎదుర్కొని జగన్‌ గత 16 నెలల క్రితం సీఎం సీట్లో కూర్చున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తున్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాలకు రూపకల్పన చేశారు. అన్నివర్గాల ప్రజలకు ప్రతీ పథకం అందాలని వాలంటీర్లను నియమించారు. ఇప్పటికే నవర్నతాల పేరిట ప్రజలందరికీ చేరువవుతుండగా.. ఇప్పుడు కొత్తగా విద్యార్థులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు.

Also Read: జగన్‌ వలసలను ప్రోత్సహిస్తోంది అందుకేనా..?

మరో ప్రతిష్టాత్మక పథకాలకి జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందు నుంచీ విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్‌.. ఇంగ్లిష్‌ మీడియం విద్యనూ ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు అందించాలని తలిచారు. ఇక ఇప్పుడు జగనన్న విద్యాకానుకను ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయనుంది. జూన్‌లో స్కూళ్ల ప్రారంభంకాగానే ఏపీలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. అయితే.. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. నవంబర్‌‌ 2 నుంచి మళ్లీ తెరుచుకోనున్నాయి.

Also Read: హిందుత్వ లొల్లి: ఢిల్లీ నుంచి రాగానే జగన్ సీరియస్ నిర్ణయం

ముఖ్యంగా ఈ కిట్‌లో 3 జతల యూనిఫాం, నోట్‌ బుక్స్‌, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బుక్స్‌, మూడు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ను ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42  లక్షల  మందికి సుమారు రూ.650 కోట్లతో జగన్‌ ప్రభుత్వం ఈ కిట్లు అందిస్తోంది. మగపిల్లలకు స్కై బ్లూ రంగు, అమ్మాయిలకు నెవీ బ్లూ రంగు బ్యాగులు ఇస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా అందించనున్నారు. అంతేకాదు.. స్కూళ్ల ప్రారంభానికి ముందే కిట్లు ఇస్తే విద్యార్థులను యూనిఫాంలు కుట్టించుకునే వెసులు బాటు ఉంటుందని జగన్‌ భావిస్తున్నారంట. అంటే.. ఈ లోపే కిట్లను విద్యార్థులకు అందజేయనున్నారన్నమాట.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Oktelugu Epaper