spot_img
Homeజాతీయ వార్తలుటీచర్ల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

టీచర్ల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Sega of Private Schools

టీచర్ పోస్టుల భర్తీ విసయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగాఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేయాలని భావించింది. విద్యార్థులు లేని పాఠశాలల్లో ఖాళీగాఉన్న వాటిని భర్తీ చేయకూడదని సంకల్పించింది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరిస్తే ప్రస్తుతమున్న ఖాళీల్లో సుమారు 2 వేల టీచర్ పోస్టులు భర్తీకి నోచుకునే అవకాశం లేదు. విద్యార్థులు లేని స్కూళ్లలో టీచర్ల భర్తీ ద్వారా ప్రయోజనం లేదని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే విద్యార్థులు లేని స్కూళ్లలోని ఖాళీ పోస్టులను, విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలల్లోని ఖాళీ పోస్టులను వేర్వేరుగా గుర్తించి ప్రతిపాదనలను పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీని ప్రకారం విద్యార్థుల్లేని పాఠశాలల్లో 2 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.

ఇవన్నీ ఎక్కువగా ప్రైమరీ స్తాయిలోనే ఉన్నట్లు తేలింది. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ర్టంలో 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగాఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సాధారణంగా ఒక్కో టీచర్ కు ప్రాథమిక పాఠశాల స్థాయిలో 20 మంది హైస్కూలు స్థాయిలో 50 మంది విద్యార్థఉలుండాలి. అలా లేకుంటే వాటిని మూసేసి సమీప స్కూళ్లకు అనుసంధానిస్తారు. అలాగే జీరో అడ్మిషన్ల స్కూళ్ల సంఖ్య పెరుగుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Oktelugu Epaper