spot_img
Homeఆంధ్రప్రదేశ్‌న్యాయపోరాటమే శరణ్యం.. ఉమపై వైసీపీ ప్రభుత్వం కాఠిన్యం

న్యాయపోరాటమే శరణ్యం.. ఉమపై వైసీపీ ప్రభుత్వం కాఠిన్యం

Devineni Uma arrestఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏ నేరం చేయకపోయినా నిందితులుగా చేర్చి అరెస్టు చేయాలని ఆదేశించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుపై కృష్ణా జిల్లా పోలీసులు పెట్టిన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే విషయం నిర్ధారణ కోసం దేవినేని ఉమ వెళితే వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఆయన కారులోనే ఉండిపోయినా ఆయనపై కేసులు నమోదు చేయడమేమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

కారులోనే కూర్చున్న వ్యక్తిపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏమిటి? ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం ఏంటి? అనే సందేహాలు వస్తున్నాయి. పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆయన వాహనం సైతం ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. దీంతో గాయపడేందుకు కారకులైన వారిని అరెస్టు చేయాలని ఉమ కారులోనే నిరసనకు దిగారు. కారు అద్దం పగులగొట్టి పోలీసులు ఉమను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

దేవినేని ఉమపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదుపై టీడీపీ నేతలు కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సీనియర్ నేతలతో బేటీ అయ్యారు. దేవినేని ఉమపై పెట్టిన కేసులు భోగస్ అని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును అడ్డుకునేందుకు టీడీపీ సమాయత్తం అవుతోంది. పోలీసుల వ్యవహార శైలిని తప్పుపడుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు దేవినేని ఉమపై కేసు పెట్టడాన్ని ఖండించారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేవినేని కోసం త్రిసభ్య కమిటీని రంగంలోకి దింపి జగన్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. గురువారం రాష్ర్ట వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి తమ నిరసన తెలిపేందుకు టీడీపీ పిలుపునిచ్చింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper