spot_img
Homeజాతీయ వార్తలుపెగసాస్.. ప్రభుత్వానికి పరేషాన్

పెగసాస్.. ప్రభుత్వానికి పరేషాన్

Pegasus rowపెగసాస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్ అట్టుడుకుతోంది. కొద్దిరోజులుగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెగాసన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చించాలని కోరుతున్నాయి. విపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనకు దిగుతుండడంతో గందరగోళం నెలకొంది.

ప్రతిరోజు వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పెగసాస్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని కేంద్రప్రభుత్వం ఆదేశించాలని కోరుతూ మంగళవారం ప్రతిపక్ష పార్టీలు రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. పెగసాస్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు విపక్ష ఎంపీలు వాయిదా తీర్మాణానికి నోటీసులు అందజేశారు. పెగసాస్ వ్యవహారంపై ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై 14 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ వద్ద సమావేశమయ్యాయ. అనంతరం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన పెగసాస్ పై ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతూ మనుగడకే మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు. పెగసాస్ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుపడుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు

ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని కోరారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయని కేంద్రం విపక్షాలపై ఆరోపణలు చేస్తోంది. రాహుల్ గాంధీ మాత్రం ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందని విమర్శిస్తున్నారు. పెగసాస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తించాలని చెప్పారు. పెగసాస్ వ్యవహారంపై సంబంధిత అధికారులను సమాచార సాంకేతికతకు చెందిన పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Oktelugu Epaper