Homeజాతీయ వార్తలుతమిళ నటులే మాట్లాడతారా? తెలుగు వారికి నోరు లేదా?

తమిళ నటులే మాట్లాడతారా? తెలుగు వారికి నోరు లేదా?

కేంద్రం అన్నింటిని తన ఆదీనంలోకి తెచ్చుకుంటోంది. ప్రతి రంగం తన గుప్పిట్లో ఉంచుకునేలా చట్టాలు తీయారు చేసుకుంటోంది. తాజాగా సినీ పరిశ్రమను కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీని ప్రకారం సినిమా ప్రదర్శనలకు అనుమతి కావాలంటే కేంద్రానిదే పూర్తి అధికారం. దీనిపై ఓ బిల్లు తయారు చేస్తోందని తెలుస్తోంది. దీనిపై అభిప్రాయాలు కూడా సేకరించింది. అయితే సినీరంగానికి చెందిన వారంతా వ్యతిరేకత చూపుతున్నారు. ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ లో కొంతమంది కేంద్రంపై […]

కేంద్రం అన్నింటిని తన ఆదీనంలోకి తెచ్చుకుంటోంది. ప్రతి రంగం తన గుప్పిట్లో ఉంచుకునేలా చట్టాలు తీయారు చేసుకుంటోంది. తాజాగా సినీ పరిశ్రమను కూడా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీని ప్రకారం సినిమా ప్రదర్శనలకు అనుమతి కావాలంటే కేంద్రానిదే పూర్తి అధికారం. దీనిపై ఓ బిల్లు తయారు చేస్తోందని తెలుస్తోంది. దీనిపై అభిప్రాయాలు కూడా సేకరించింది. అయితే సినీరంగానికి చెందిన వారంతా వ్యతిరేకత చూపుతున్నారు. ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. బాలీవుడ్ లో కొంతమంది కేంద్రంపై గొంతు విప్పుతున్నారు.

తమిళ రంగానికి చెందిన కమల్ హాసన్, సూర్య లాంటి వారు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ చట్టం సినీపరిశ్రమకు విఘాతమని చెబుతున్నారు. టాలీవుడ్ నుంచి మాత్రం ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ప్రశ్న లేవనెత్తలేదు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశాక కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. గతంలో ఇలా జోక్యం చేసుకుంటే సుప్రీంకోర్టు తప్పు పట్టింది. కేంద్రం కల్పించుకోవాలంటే తగిన ఆధారాలుండాలని తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి కేంద్రం చట్టం చేయాలనే ఆలోచనకు వచ్చింది.

దేశ వ్యతిరేక భావాలతో సినిమాలు నిర్మిస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం తన ఆధీనంలో ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే సినిమాలపై దేశ వ్యతిరేకత ముద్ర వేస్తున్నారు. ఈ చట్టం వస్తే సినిమాలపై పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కేంద్రం అనుకున్నట్లుగా చట్టం తీసుకువస్తే సృజనాత్మకత పూర్తిగా ఒక వైపే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బీజేపీ వ్యతిరేకత అంశాలపై సినిమాలు తీసినా వాటిని బయటకు రానీయడం లేదు. మనం ఎంత గోల చేసినా లాభం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛను కేంద్రం ఈ చట్టం నియంత్రిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. తమిళ, హిందీ రంగానికి చెందిన కొంత మంది ఈ చట్టంపై విమర్శలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ నటులకు ఈ చట్టంపై అవగాహన ఉందా లేదా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper