Nani Market: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు కొంత మంది కొన్ని సినిమాలతో తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నాని లాంటి హీరో మీడియం రేంజ్ హీరో గానే గుర్తింపు సంపాదించుకున్నప్పటికి ఆయనకు సక్సెస్ ఫుల్ టాక్ వచ్చిన కూడా ఆయన సినిమాలకు భారీ కలెక్షన్స్ అయితే రావడం లేదు. కారణం ఏంటంటే ఆయన చేస్తున్న సినిమాలు చాలా మంది ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతున్నాయి.
దానివల్ల ఆ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకున్న కూడా వాళ్ళు రిపీటెడ్ గా సినిమాని చూడకపోవడంతో ఆయనకు భారీ కలెక్షన్స్ రావడం లేదు. నానికి 100 కోట్ల మార్కెట్ మాత్రమే ఉంది. ప్రస్తుతం ‘ప్యారడైజ్’ సినిమా 200 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.
నాని కి ఉన్న మార్కెట్ ని బట్టి చూస్తే ఈ సినిమా బడ్జెట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. నిజానికి దసరా సినిమాతో తనకంటూ ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. తను ఎంతగా అరాటపడిన కూడా సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందనేది తెలియడం లేదు. మొత్తానికైతే ఈ సినిమాతో ప్రేక్షకులందరిని మైమరిపింపజేయాలని దర్శకుడైతే భావిస్తున్నాడు.
నాని కి ప్రస్తుతం 100 కోట్ల మార్కెట్ ఉండటం వల్ల ఈ సినిమాకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఈ సినిమాతో నాని మార్కెట్ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ మూవీ విషయంలో ఏం జరగబోతుందనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే… ఈ మూవీ భారీ హిట్ అయితే మాత్రం నాని శ్రీకాంత్ ఓదెల క్రేజ్ మారిపోయే అవకాశాలైతే ఉన్నాయి…