Homeజాతీయ వార్తలుRSS Chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ అమెరికా టూర్‌.. న్యూయార్క్‌ మేయర్‌ కీలక వ్యాఖ్యలు!

RSS Chief Mohan Bhagwat: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ అమెరికా టూర్‌.. న్యూయార్క్‌ మేయర్‌ కీలక వ్యాఖ్యలు!

RSS Chief Mohan Bhagwat: జోహ్రాన్‌ మామ్దాని.. అగ్రరాజ్యం అమెరికా రాజధాని న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికై అధికార పార్టీకి షాక్‌ ఇచ్చాడు. యువ సంచలనంగా మారాడు. అయితే ఈ మామ్దాని పచ్చి భారత వ్యతిరేకి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన వాయిదాకు మామ్దానితో భేటీ కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అమెరికాలో ఆయన ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన నేతే. కానీ, భారత్‌పై విషం చిమ్ముతూ, ప్రధాని మోదీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నాడు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ […]

RSS Chief Mohan Bhagwat: జోహ్రాన్‌ మామ్దాని.. అగ్రరాజ్యం అమెరికా రాజధాని న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికై అధికార పార్టీకి షాక్‌ ఇచ్చాడు. యువ సంచలనంగా మారాడు. అయితే ఈ మామ్దాని పచ్చి భారత వ్యతిరేకి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన వాయిదాకు మామ్దానితో భేటీ కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అమెరికాలో ఆయన ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన నేతే. కానీ, భారత్‌పై విషం చిమ్ముతూ, ప్రధాని మోదీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నాడు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనపైనా మామ్దాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగస్టు 29న మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో జరగనున్న ఈవెంట్‌కు తన మద్దతు లేదని, అయితే ప్రైవేట్‌ కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారం నగర పరిపాలనకు లేదని స్పష్టం చేశారు.

ఈవెంట్‌ నేపథ్యం
ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకల సందర్భంగా గ్లోబల్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో భాగంగా భాగవత్‌ అమెరికా, కెనడా, యూకే పర్యటన చేస్తున్నారు. న్యూయార్క్‌లో యూనివర్సల్‌ ఒన్‌నెస్‌ సెలబ్రేషన్‌ పేరుతో దాదాపు 5 వేల మంది భారతీయ మూలాల ప్రజలతో సమావేశం జరగనుంది. ఆర్గనైజర్లు దీనిని ప్రపంచం ఒక కుటుంబం అనే సందేశంతో ఐక్యత, సామరస్యం, అంతర్‌ మత సంభాషణను ప్రోత్సహించే కార్యక్రమంగా ప్రదర్శిస్తున్నారు. భాగవత్‌ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు.

మమ్దాని అభ్యంతరం..
న్యూయార్క్‌ సిటీ మొదటి ఇండియన్‌–అమెరికన్‌ మేయర్‌గా మమ్దాని తన వ్యతిరేకతను స్పష్టం చేశారు. ఆయన కుటుంబం నుంచి తెలుసుకున్న భారత్‌ చిత్రం బహుళత్వ, లౌకిక గణతంత్రంగా ఉందని, ప్రతీ వ్యక్తికి సమాన స్థానం ఉండాలని చెప్పారు. వివక్షతో కూడిన విజన్‌పై ఆధారపడిన ఉద్యమం ఎదుగుదల చాలా ఇబ్బందికరంగా ఉందని, ఇది ఇండియన్‌–అమెరికన్‌గా తనతోపాటు ప్రతీ రంగు, మతం, విశ్వాసం ఉన్నవారికి చెందినదని నమ్మే నగర మేయర్‌గా కూడా వ్యతిరేకం అని అన్నారు. అయితే ప్రైవేట్‌ ఈవెంట్‌ను రద్దు చేసే అధికారం నగర పరిధిలో లేదని పేర్కొన్నారు.

ఒకవైపు వ్యతిరేకత.. ఇంకోవైపు మద్దతు
ఇంటర్‌ఫెయిత్, సివిల్‌ రైట్స్‌ సంస్థలు అయిన హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్, ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌ వంటివి ఈవెంట్‌ను వ్యతిరేకిస్తూ నగర హాల్‌ బయట నిరసనలు నిర్వహించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ను వివక్షాత్మక ఐడియాలజీగా చూస్తూ, మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ వేదికను రద్దు చేయాలని కోరుతున్నారు. మరోవైపు, ఆర్గనైజర్లు దీనిని సాంస్కృతిక, ఐక్యతా కార్యక్రమంగా వర్ణిస్తున్నారు. ఇక మరి కొందరు దానిని సాంస్కృతిక, జాతీయవాద ఉద్యమంగా చూస్తే, మరికొందరు మైనారిటీలపై ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తారు.

మామ్దాని వ్యాఖ్యలు భారతీయ అమెరికన్‌ సమాజంలోని భిన్న ధోరణులను, భారత్‌ లోపలి రాజకీయ చర్చలు విదేశాల్లో ఎలా ప్రతిధ్వనిస్తాయో చూపిస్తున్నాయి. ఈవెంట్‌ జరగనుంది. మమ్దాని అభ్యంతరం వ్యక్తం చేసినా, చట్టపరమైన అధికారం లేకపోవడం వల్ల అది కొనసాగుతుంది. ఇది స్వేచ్ఛా వ్యక్తీకరణ, బహుళత్వం, ఐడియాలజీల మధ్య సంభాషణకు మరో ఉదాహరణగా నిలుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper