Homeవింతలు-విశేషాలుTarzan Boy: ఈ బాలుడు టార్జాన్ కు సోదరుడు.. అడవి పందితో రెండు గంటల పాటు.....

Tarzan Boy: ఈ బాలుడు టార్జాన్ కు సోదరుడు.. అడవి పందితో రెండు గంటల పాటు.. వైరల్ వీడియో

Tarzan Boy: చాలా సంవత్సరాల క్రితం హాలీవుడ్లో టార్జాన్ అనే సినిమా వచ్చింది గుర్తుందా.. ఆ సినిమాలో హీరో అడవిలో నివాసం ఉంటుంటాడు. అద్భుతాలు చేస్తుంటాడు. క్రూరమైన జంతువులతో పోరాడుతుంటాడు. చివరికి తన నేపథ్యం తెలుసుకొని హీరో లాగా మారిపోతుంటాడు. టార్జాన్ పాత్ర చేసే సాహసాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులతో పోరాడుతున్న దృశ్యాలు రోమాలు నిక్కపొడిచే విధంగా చేస్తుంటాయి. అందువల్లే ఎవరైనా సహసాలు చేస్తే టార్జాన్ తమ్ముడివా అంటుంటారు. టార్జాన్ సోదరుడి మాదిరిగానే సాహసాలు చేశాడు […]

Tarzan Boy: చాలా సంవత్సరాల క్రితం హాలీవుడ్లో టార్జాన్ అనే సినిమా వచ్చింది గుర్తుందా.. ఆ సినిమాలో హీరో అడవిలో నివాసం ఉంటుంటాడు. అద్భుతాలు చేస్తుంటాడు. క్రూరమైన జంతువులతో పోరాడుతుంటాడు. చివరికి తన నేపథ్యం తెలుసుకొని హీరో లాగా మారిపోతుంటాడు. టార్జాన్ పాత్ర చేసే సాహసాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా జంతువులతో పోరాడుతున్న దృశ్యాలు రోమాలు నిక్కపొడిచే విధంగా చేస్తుంటాయి. అందువల్లే ఎవరైనా సహసాలు చేస్తే టార్జాన్ తమ్ముడివా అంటుంటారు.

టార్జాన్ సోదరుడి మాదిరిగానే సాహసాలు చేశాడు ఈ బాలుడు. పైగా అతడు తనకు ఎదురైన ఆపదను చూసి పారిపోలేదు. తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ వెనకడుగు వేయలేదు. ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగాడు. పోరాటాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. దూకుడుగా ముందుకు వెళ్లాడు. సహాయం చేస్తూ శత్రువును నియంత్రించాడు. తద్వారా తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అతడు చేసిన సాహసం ఇప్పుడు దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది.

మనదేశంలో అటవీ ప్రాంతం అధికంగా ఉండే రాష్ట్రాలలో ఒడిశా ఒకటి. ఈ రాష్ట్రంలోనే కటక్ సమీపంలో బంకి అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ఒక కెనాల్ లో 14 సంవత్సరాల బాలుడు స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక అడవి పంది వచ్చింది. ఆ బాలుడు మీద దాడి చేసింది. అయితే ఆ బాలుడు ఏమాత్రం భయపడకుండా దాదాపు రెండు గంటల పాటు ఆడవి పందితో పోరాటం చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి సాహసం చేశాడు. అంతేకాదు ఆ పంది మెడను 30 నిమిషాల పాటు గట్టిగా పట్టుకున్నాడు. దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అలానే ఉన్నాడు. పైగా ఆ కాలువలో నీళ్లు విపరీతంగా ఉన్నప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా పందిని అలానే గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆ సమయంలో స్థానికులు వచ్చి ఆ అడవి పంది నుంచి ఆ బాలుడిని కాపాడారు. ఆ తర్వాత ఆ బాలుడు చూపించిన ధైర్యాన్ని.. పోరాటాన్ని మెచ్చుకున్నారు.

అడవి పంది కొమ్ములతో ఆ బాలుడిని పొడిచేందుకు ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన అతడు వెంటనే ఆ పంది మెడ పట్టుకున్నాడు. దానికి ఊపిరి ఆడకుండా చేశాడు. దాని కొమ్ములను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అడవి పందికి ఏం చేయాలో పాలు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా అడవి పంది తలవంచక తప్పలేదు. ఈ పోరాటంలో ఆ బాలుడికి గాయాలు అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper