Homeఎంటర్టైన్మెంట్RSS Chief Meeting With Tollywood Celebrities: టాలీవుడ్‌ సెలబ్రిటీలతో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ రహస్య భేటీ.....

RSS Chief Meeting With Tollywood Celebrities: టాలీవుడ్‌ సెలబ్రిటీలతో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ రహస్య భేటీ.. ఏంటి కథ?

RSS Chief Meeting With Tollywood Celebrities: మోహన్‌ భగవత్‌.. పరిచయం అక్కరలేని పేరు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతోంది. గతేడాది 75 ఏళ్లు నిండినవారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇదిలా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తాజాగా టాలీవుడ్‌ సెలబ్రిటీలతో రహస్యంగా భేటీ అయ్యారు. హీరో వెంకటేశ్‌ […]

RSS Chief Meeting With Tollywood Celebrities: మోహన్‌ భగవత్‌.. పరిచయం అక్కరలేని పేరు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌. ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పదేళ్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతోంది. గతేడాది 75 ఏళ్లు నిండినవారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇదిలా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తాజాగా టాలీవుడ్‌ సెలబ్రిటీలతో రహస్యంగా భేటీ అయ్యారు.

హీరో వెంకటేశ్‌ నివాసంలో..
టాలీవుడ్‌ స్టార్‌ వెంకటేశ్‌ నివాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌తో ఇండస్ట్రీ ప్రముఖులు సమావేశమైనట్లు సమాచారం వచ్చింది. ఈ మీటింగ్‌కు హోరోలు నాగార్జున, నాని, తేజ సజ్జా వంటి హీరోలు, నిర్మాతలు మైత్రీ రవి, సాహు గారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మోహన్‌ భాగవత్‌ హాజరు ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత తెచ్చిపెట్టింది.

టాలీవుడ్‌–ఆర్‌ఎస్‌ఎస్‌ లింక్‌..?
టాలీవుడ్‌ స్టార్స్‌ సాధారణంగా సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రమే పరిమితం. కానీ ఇటీవలి కాలంలో రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం పెరిగింది. వెంకటేశ్‌ కుటుంబం (చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ వంటి రాజకీయ సంబంధం) ఈ సమావేశాన్ని మరింత ఆసక్తికరంగా మారింది. మోహన్‌ భాగవత్‌ దేశీయ సంస్కృతి, హిందూ సమాజం విషయాల్లో మాట్లాడతారు.

రాజకీయ వర్గాల్లో చర్చ..
ఈ భేటీ టాలీవుడ్‌ను రాజకీయంగా ప్రభావితం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీతో బీజేపీ అలయన్స్‌ నేపథ్యంలో ఇది కొత్త అలయన్స్‌లకు బీజం వేస్తుందా? లేదా సామాజిక అవగాహన కోసమా? ఫ్యాన్స్‌ మధ్య విభజన రావచ్చు, సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.

సమావేశం గురించి అధికారిక ప్రకటన రాకుండా ఊహాగానాలు కొనసాగుతాయి. ఇది టాలీవుడ్‌కు రాజకీయ రంగంతో మరింత దగ్గరికి తీసుకువస్తుందా అనేది వేచి చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper