Homeజాతీయ వార్తలుDharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. ఆయన రాజీనామా చేస్తే బిజెపికి వచ్చిన లాభమేంటి.. ఇప్పుడు ఇవే చర్చలు జాతీయస్థాయిలో నడుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఆ కథనాల ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక చాలా కథ జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. […]

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. ఆయన రాజీనామా చేస్తే బిజెపికి వచ్చిన లాభమేంటి.. ఇప్పుడు ఇవే చర్చలు జాతీయస్థాయిలో నడుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఆ కథనాల ప్రకారం..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక చాలా కథ జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత జనతా పార్టీతో దగ్గరగా ఉండే కొంతమంది వ్యక్తులు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక జరిగిన సంఘటనను బయటపెడుతున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒత్తిడి తీసుకురావడం వల్లే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. యువకులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరం కావడంతోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ నిర్ణయం తీసుకుందని.. దానిని భారతీయ జనతా పార్టీ అమలు చేసిందని సమాచారం.

ఉత్తరప్రదేశ్.. పంజాబ్ రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం భారతీయ జనతా పార్టీకి అత్యంత అవసరం. పైగా పంజాబ్ రాష్ట్రంలో చీకటి శక్తులు రాజ్యాన్ని ఏలుతున్నాయి. పైగా గతంలో పంజాబ్ రాష్ట్రంలో పర్యటించడానికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లినప్పుడు.. అక్కడి చీకటి శక్తులు అడ్డుకున్నాయి. నడిరోడ్డు మీద నరేంద్ర మోడీ కాన్వాయ్ మొత్తాన్ని ఆపేశాయి. అప్పటినుంచి పంజాబ్ మీద బిజెపి ఫోకస్ పెట్టింది. కాకపోతే క్రితం ఎన్నికల్లో అక్కడ ఆప్ గెలిచింది. నరేంద్ర మోడీ కాన్వాయ్ నడిరోడ్డు మీద ఆపినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

ఇప్పుడు పంజాబ్ మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తాజాగా జరిగిన ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ఉద్యమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ తమ విజయం కాకుండా.. విద్యార్థుల విజయం గా చెబుతోంది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరిస్థితి చేయి దాటకముందే ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించాలని సూచించినట్టు సమాచారం. పైగా యూపీ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో గెలిచి హ్యాట్రిక్ అందుకోవాలని.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావిస్తోంది. అందువల్లే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ అద్భుతమైన నాయకుడైనప్పటికీ.. ఎటువంటి అవినీతి మచ్చలేని ప్రజా ప్రతినిధి అయినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper