spot_img
Homeజాతీయ వార్తలుRevanth Reddy: కేసీఆర్ బీఆర్ఎస్ పై అదిరిపోయే పంచ్ వేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేసీఆర్ బీఆర్ఎస్ పై అదిరిపోయే పంచ్ వేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి మాటల తూటాలు పేల్చగల నేత ఎవరంటే ఖచ్చితంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు చెబుతారు. అందరూ కేసీఆర్ జాతీయ పార్టీ ‘బీఆర్ఎస్’పై ప్రశంసలు కురిపిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం సెటైర్లతో విరుచుకుపడ్డారు. తాజాగా కేసీఆర్ తో తెలంగాణకు రుణం తీరిపోయిందని.. సంచలన కామెంట్స్ చేశారు.

కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో.. ఆర్థికంగా బలోపేతమయ్యారని.. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంది.. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారు. తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ఆయన గ్రహించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కు రుణం తీరిపోయిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

తెలంగాణ అనే పదం వినిపించకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని.. కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే బీఆరెఎస్ మాట ఎత్తుకున్నాడని అన్నారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమన్నారు. తెలంగాణ పదాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని..తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదని విమర్శించారు.

ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా.. ఆయనలోని వికృత ఆలోచనలకు ఇది పరాకాష్ట.. ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్ కు అర్హత లేదు..తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలి.. ప్రజల్ని మభ్య పెట్టడానికే బీఆరెఎస్ .. ఆ తరువాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలని దేవుడిని కోరుకోండని తెలిపారు.

దసరా జమ్మి చెట్టు పూజల్లో కాగితంపై రాసి పెట్టండని.. నేను కూడా జమ్మి చెట్టు పూజలో కాగితంపై రాసి దేవుడిని కోరుకుంటా తెలంగాణలో 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీ విభజన సమస్యలను మేమే పరిష్కరించుకుంటామని.. ఇక తెలంగాణతో కేసీఆర్ కు రుణం తీరిపోయిందని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper