Godfather Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు హిందీ బాషలలో ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలైన మొదటి ఆట నుండి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా కి ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి..ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఈ సినిమా వసూళ్ల పై ఏ మాత్రం ప్రభావం చూపించలేదనే చెప్పాలి..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతూ కాసుల కానక వర్షం కురిపించింది..పాజిటివ్ టాక్ కి తోడుగా దసరా పండగ తోడవ్వడం తో మ్యాట్నీ షోస్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడేసాడు..ఇదే రోజు నాగార్జున ఘోస్ట్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ వారి స్వాతి ముత్యం వంటి సినిమాలు కూడా విడుదల అవ్వడం తో గాడ్ ఫాదర్ సినిమాకి కాస్త లిమిటెడ్ షోస్ దొరికాయి..కానీ ప్రాంతాల వారీగా వసూళ్లను చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి మాస్ ఏంటో అర్థం అవుతుంది.

ముందుగా ఈ సినిమా USA కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి..ఇక్కడ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ ఏమరుపాటు రిలీజ్ వల్ల దాదాపుగా 2 లక్షల డాలర్స్ కేవలం ప్రీమియర్ షోస్ నుండే నష్టం కలిగింది..తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ సినిమాకి సరైన రిలీజ్ ఇవ్వలేకపోయాడు డిస్ట్రిబ్యూటర్..అందువల్ల ఈ సినిమాకి ఇక్కడ ప్రీమియర్ షోస్ లో భారీగానే నష్టం వాటిల్లింది..లేకపోతే కేవలం ప్రీమియర్ షోస్ నుండే 5 లక్షల డాలర్లు వసూలు చెయ్యాల్సిన సినిమా ఇది..ఇప్పుడు ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 5 లక్షల డాలర్స్ వసూలు చేసింది..అంతే కాకుండా ఆస్ట్రేలియా లో అసలు ఈ సినిమా విడుదల కూడా కాకపోవడం విశేషం..డిస్ట్రిబ్యూటర్స్ తప్పిదం వల్ల ఇంత నష్టం వాటిల్లింది..ఇక ఆంధ్ర తెలంగాణ లో మాత్రం ఈ సినిమా రికార్డు స్థాయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపేసింది..కేవలం ఈ రెండు ప్రాంతాల నుండే ఈ సినిమా 21 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని సమాచారం..ప్రాంతాల వారీగా బ్రేకప్ ని ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో 6 కోట్ల రూపాయిల షేర్, సీడెడ్ ప్రాంతం లో 3 కోట్ల రూపాయిల షేర్, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రెండు కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందట.

వంద శాతం ఆక్యుపెన్సీ తో నడిచినా కూడా టికెట్ రేట్స్ తక్కువ ఉండడం మరియు లిమిటెడ్ రిలీజ్ ఉండడం వల్ల కాస్త తక్కువ నంబర్లు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..అలా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 21 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది..మరో విశేషం ఏమిటి అంటే ఈ సినిమాని చెన్నై లో కూడా మొదటి రోజు విడుదల చేయలేకపోయారు నిర్మాతలు..ఇది వారి చేతకాని తనం కి నిదర్శనం అని..కేవలం వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఈ సినిమాకి మొదటి రోజు అదనంగా 10 కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశం ని కోల్పోయామని ..చిరంజీవి గారి అభిమానులు సోషల్ మీడియా లో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ని టాగ్ చేసి తిడుతున్నారు.
[…] […]