Homeఆంధ్రప్రదేశ్‌Ramoji Rao- Senior NTR: రామోజీ కలం కత్తి కట్టింది.. ఎన్టీఆర్ బట్టలూడదీసి బజారుకీడ్చింది

Ramoji Rao- Senior NTR: రామోజీ కలం కత్తి కట్టింది.. ఎన్టీఆర్ బట్టలూడదీసి బజారుకీడ్చింది

Ramoji Rao- Senior NTR: తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. ప్రజా రంజక పాలన చేస్తూ సీనియర్ ఎన్టీఆర్ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఇందులో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆయన తన చరిష్మాతో అధిగమించగలిగారు. పేదింట అన్న అయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని నాయకుడిగా పేరు పొందారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. అలాంటి ఎన్టీఆర్ ఎంతటి ఎత్తులు చూశారో.. అలాంటి పల్లాలు ఎదుర్కొన్నారు.

చంద్రబాబు ప్రవేశంతో.

వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ బసవ తారకం వియోగం తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు. అయిన వాళ్ళ ఆదరణ లేక నరకం చూశారు. ఇలాంటి సమయంలోనే ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించారు. తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితమయ్యారు. అనంతరం సీనియర్ ఎన్టీఆర్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇది సహజంగానే నందమూరి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. అంతమంది కొడుకులు, కూతుళ్లు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ను ఎవరూ దగ్గరికి తీయకపోవడంతో ఆయనకు లక్ష్మీపార్వతి సాన్నిహిత్యం అనివార్యమైంది. ఎలాగూ భార్య హోదా వచ్చింది కాబట్టి లక్ష్మీపార్వతి కూడా పార్టీ మీద పెత్తనం చలాయించడం మొదలుపెట్టింది. ఇప్పటికే చంద్రబాబు కాచుకుని కూర్చుని ఉండటంతో ఆయన పార్టీలో అసమ్మతికి తెరలేపాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలోనే ఆయనకు వ్యతిరేక స్వరం వినిపించాడు.. ఎమ్మెల్యేలతో వైస్రాయ్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేయించాడు. ఎన్టీఆర్ మీదకు చెప్పులు కూడా విసిరేయించాడు. మొన్న విజయవాడలో జరిగిన శతజయంతి సభలో సీనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన రజినీకాంత్.. నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఈ బ్యాచ్ లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. ఇక ఈ పరిణామం తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కోలుకోలేకపోయారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు వివిధ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

చంద్రబాబుకు రామోజీ తోడయ్యాడు

నాటి సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్లో ప్రభుత్వంగా చెప్పుకోవాల్సిన పేరు రామోజీరావుది.. ఆయన తన పేపర్లో పనిచేసే శ్రీధర్ ద్వారా అడ్డగోలుగా కార్టూన్స్ వేయించాడు. సీనియర్ ఎన్టీఆర్ ను నపుంసకుడిగా, వలువలు లేని వ్యక్తిగా చిత్రీకరించాడు.. తన ఈనాడు పత్రికలో ఎన్టీఆర్ మీద విపరీతంగా వార్తలు రాయించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మాత్రమే దిక్కు అనేలాగా ప్రజల్లో ఒక భ్రమ కల్పించాడు. అంతేకాదు జనాల్లో చంద్రబాబు నాయుడుని మరింత ప్రొజెక్ట్ చేసేందుకు ఈవినింగ్ ఎడిషన్ కూడా ప్రింట్ చేసి ఉచితంగా పంపిణీ చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కు బతికుండగానే నరకం చూపించాడు. చివరికి ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.

నేటికీ ఆయన పేరే

బతుకున్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ను వేధించిన చంద్రబాబు అండ్ కో నేడు కూడా ఆయన పేరును స్తుతిస్తుండడం విశేషం. ఎందుకంటే చనిపోయినప్పటికీ నేటికీ ఎన్టీఆర్ చరిష్మా తగ్గలేదు. కానీ ఇక్కడే చంద్రబాబు మళ్ళీ చక్రం తిప్పుతున్నారు. తనకు అలవాటైన రాజకీయాలు చేస్తూ పార్టీకి నందమూరి కుటుంబ సభ్యులను దూరం చేస్తున్నారు. మొన్న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్, మిగతావారిని పిలవకపోవడమే ఇందుకు కారణం. ఇక నాడు సీనియర్ ఎన్టీఆర్ పై శ్రీధర్ బొమ్మలు, రామోజీరావు రాసిన రాతలు, సీనియర్ ఎన్టీఆర్కు వ్యక్తిత్వం లేదని చంద్రబాబు కూసిన కూతలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular