Homeవింతలు-విశేషాలుAnchor Viral Video: న్యూస్ చెప్పుకుంటూ.. యాంకర్ నిద్ర పోయింది.. వైరల్ వీడియో

Anchor Viral Video: న్యూస్ చెప్పుకుంటూ.. యాంకర్ నిద్ర పోయింది.. వైరల్ వీడియో

Anchor Viral Video: న్యూస్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు.. ఛానల్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. లైవ్ లో ఏదైనా తప్పులు దొర్లే అవకాశం ఉన్నప్పుడు వెంటనే జాగ్రత్త పడుతుంటారు. యాంకర్ కోణంలో ఏదైనా తప్పు జరిగితే వెంటనే అప్రమత్తమవుతుంటారు. చానల్ నిర్వాహకులు నిత్యం అప్రమత్తంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. అవి ఒకప్పుడైతే అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి ఆ తప్పులు వెంటనే వ్యాప్తిలోకి వస్తున్నాయి. క్షణంలోనే […]

Anchor Viral Video: న్యూస్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు.. ఛానల్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. లైవ్ లో ఏదైనా తప్పులు దొర్లే అవకాశం ఉన్నప్పుడు వెంటనే జాగ్రత్త పడుతుంటారు. యాంకర్ కోణంలో ఏదైనా తప్పు జరిగితే వెంటనే అప్రమత్తమవుతుంటారు.

చానల్ నిర్వాహకులు నిత్యం అప్రమత్తంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో తప్పులు జరిగిపోతూనే ఉంటాయి. అవి ఒకప్పుడైతే అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. ఇప్పుడు సోషల్ మీడియా కాలం కాబట్టి ఆ తప్పులు వెంటనే వ్యాప్తిలోకి వస్తున్నాయి. క్షణంలోనే విస్తృతమవుతున్నాయి. అటువంటి తప్పే ఒకటి జరిగింది. పైగా అది పేరుపొందిన ఛానల్ కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది..

వెస్ట్రన్ మీడియాలో ఫాక్స్ ఛానల్ చాలా ఫేమస్. ఈ ఛానల్ లో రకరకాల విధాలుగా యాంకర్లు వార్తలు చదువుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో యాంకర్లు పని ఒత్తిడి వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ దానిని బయటికి చూపించరు. కాకపోతే ఒక యాంకర్ మాత్రం తన మీద ఉన్న ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. చివరికి వార్తలు చదువుకుంటూ చేయరాని పని చేసింది.

అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఫాక్స్ న్యూస్ ఛానల్ లో.. వార్తలు చదువుతున్న ఒక యాంకర్ నిద్రలోకి జారుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది. అయితే ఆమె మీద ఎటువంటి ట్రోల్స్ చేయడం లేదు. పైగా ఆమెకు చాలామంది సపోర్ట్ గా నిలుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఆమె ఇద్దరు పిల్లల తల్లి. తీవ్రమైన పని ఒత్తిడి వల్ల ఇలా నిద్రలోకి జారుకుని ఉంటుందని.. ఇలాంటి సమయంలో ఆమెకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు..కాగా, కొద్దిసేపు అలా నిద్రలోకి జారుకున్న ఆ లేడీ యాంకర్ ఆ తర్వాత మళ్లీ వార్తలు చదవడం ప్రారంభించింది.

వెస్ట్రన్ మీడియాలో యాంకర్ల మీద విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు వారికి విశ్రాంతి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే వారు ఒక్కొక్కసారి నిద్రలోకి జారుకుంటారు. ఫాక్స్ న్యూస్ ఛానల్ లో వ్యాఖ్యాత నిద్రలోకి జారుకోవడం కొత్త అయినప్పటికీ.. గతంలో అనేక పర్యాయాలు వెస్ట్రన్ మీడియాలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన తర్వాత వెస్ట్రన్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు విశ్రాంతి ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వస్తోంది. మరి దీనిపై మేనేజ్మెంట్లు ఏ విధంగా చర్యలు తీసుకుంటాయో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper