Junior NTR OTT: ఈమధ్య సినిమా ఎంటర్టైన్మెంట్ కి పోటీ గా ఓటీటీ మాధ్యమం ఎదిగిపోయింది.ప్రేక్షకులు కూడా అధికశాతం సినిమాలను థియేటర్స్ లో చూడడం కంటే కూడా ఎక్కువగా ఓటీటీ లో చూసేందుకే మక్కువ చూపిస్తున్నారు. రోజు రోజుకి ఓటీటీ ని వాడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది, వెబ్ సిరీస్ లు, టాక్ షోలు మరియు సరికొత్త గేమ్ షోస్ తో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దక్కుతుంది.
రీసెంట్ గా స్టార్ హీరోలు కూడా ఓటీటీ లో ప్రత్యేకమైన టాక్ షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఒప్పుకుంటున్నారు. రీసెంట్ గానే ఆహా డిజిటల్ మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇండియాలోనే టాప్ 10 టాక్ షోస్ లో ఒకటిగా నిల్చింది.ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అలాంటి టాక్ షో ని ప్లాన్ చేసేందుకు సిద్ధం అవుతుందట ఒక ఓటీటీ ఛానల్.
అయితే ఆయన డిస్నీ + హాట్ స్టార్ లోకి వస్తున్నాడా, లేదా ఆహా మీడియా లోకి వస్తున్నాడా అనేది ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు కానీ, ఎన్టీఆర్ ఒక టాక్ షో ని ప్రముఖ ఓటీటీ ఛానల్ లో నిర్వహించబోతున్నాడు అని మాత్రం తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 మరియు ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ వంటి షోస్ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఈ టాక్ షో కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీ లో గత కొంత కాలం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ పై ఒక భారీ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించారు.త్వరలోనే మరో షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది.