Rahul Gandhi Secret Vacation: మొన్నటివరకు బీహార్లో ఉన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. ఓటు అధికార్ ర్యాలీతో అక్కడి ప్రజల మనసును చూరగొనే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఓట్ చోర్ అంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు ఇండియా కూటమిలోని మిగతా నాయకులు కూడా జత కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా రాహుల్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాహుల్ ర్యాలీ ముగిసినట్టు కనిపిస్తోంది. దీంతో ఆయన బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాహుల్ గాంధీ మలేషియాలో ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మలేషియాలో ఉన్న విషయాన్ని బిజెపి బయట పెట్టింది. ఆయన రహస్య విహారయాత్రను ఆస్వాదిస్తున్నారని బిజెపి ఐటీ సెల్ ఇన్చార్జి అమిత్ మాలవ్య ఆరోపించారు..” రాహుల్ గాంధీ మరొకసారి మాయమైపోయారు. ఈసారి ఆయన మలేషియా వెళ్ళిపోయారు. బీహార్ ఎన్నికల వేడి నుంచి ఆయన బ్రేక్ కోరుకున్నట్టు తెలుస్తోంది. లేదా ఎవరికి తెలియకూడని రహస్య సమావేశానికి వెళ్లి ఉండవచ్చు. ప్రజల సమస్యలు ఉంటే .. ఆయన మాత్రం సెలవుల్లో ఉంటారు” అని మాలవ్య ఆరోపించారు. ట్విట్టర్ ఎక్స్ లో ఒక ఫోటో కూడా షేర్ చేశారు.
మాలవ్య షేర్ చేసిన ఫోటోలో రాహుల్ గాంధీ వెస్ట్రన్ దుస్తులతో కనిపిస్తున్నారు. తల పైన ఒక క్యాప్ ధరించారు. ఆయన ఒక మహిళతో మాట్లాడుతున్నట్టు ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఇంతకీ రాహుల్ మలేషియా ఎందుకు వెళ్లారు.. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు.. అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కూడా రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ పార్టీలో పాల్గొన్నారు. ఆ ఫోటోలలో చైనా యువతి ఒకరు కనిపించారు. దీంతో ఆయన మన దేశానికి సంబంధించిన రహస్య విషయాలను డ్రాగన్ దేశానికి చేరవేర్చుతున్నారని బిజెపి నాయకులు ఆరోపించారు. రాహుల్ గాంధీ రహస్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని.. అందువల్లే తరచూ విదేశాలకు వెళ్తున్నారని బిజెపి నాయకులు అప్పట్లో ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు మలేషియాలో ఉన్న రాహుల్ గాంధీ బిజెపికి దొరికిపోయారు. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలాంటి స్పష్టత ఇస్తారనేది తెలియాల్సి ఉంది. మలేషియా కు రాహుల్ వెళ్ళిన ఫోటోలను బిజెపి ఐటి విభాగం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తోంది. రాహుల్ గాంధీ రహస్య జీవితానికి ఇది ఒక మచ్చు తనక అని.. ఇలాంటివి చాలా ఉన్నాయని.. ఇప్పటికైనా ఆయనకు సపోర్ట్ చేసేవారు ఇవన్నీ గుర్తించాలని బిజెపి నాయకులు అంటున్నారు..