Bigg Boss 9 Telugu: మరికొద్ది గంటల్లోనే స్టార్ మా ఛానల్ లో బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ మొదలు కానుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్లానింగ్ చేశారు బిగ్ బాస్ టీం. కంటెస్టెంట్స్ లిస్ట్ ని సాధ్యమైనంత వరకు గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే చేశారు కానీ, గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అవ్వడంతో కంటెస్టెంట్స్ లిస్ట్ మొత్తం బయటకు వచ్చేసింది. అయితే ప్రతీ బిగ్ బాస్ సీజన్ కి రివ్యూస్ ఇవ్వడం లో మంచి పేరు సంపాదించిన ఆదిరెడ్డి లీక్ చేసిన లిస్ట్ ప్రకారం ఈ సీజన్ లో హౌస్ లోకి ఎవరెవరు అడుగుపెట్టబోతున్నారో ఒకసారి చూద్దాం. ఈయన సీజన్ 6 టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే.
ఇక ఆయన లిస్ట్ ప్రకారం చూస్తే రీతూ చౌదరి, తనూజ గౌడ, ఇమ్మానుయేల్ వంటి వారు ఇప్పటికే హౌస్ లోకి అడుగు కూడా పెట్టేశారట. ఈ ముగ్గురు కూడా రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘కూకూ విత్ జాతి రత్నాలు’ ప్రోగ్రాం లో పాల్గొన్న సంగతి తెలిసిందే. వీళ్ళ ద్వారా అదిరిపోయే రేంజ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ముఖ్యంగా రీతూ చౌదరి మీద ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నాయో మనమంతా చూసాము. బయట ఉన్నప్పుడే అంత రచ్చ చేస్తే ఇక హౌస్ లో ఈమె ఎలాంటి రచ్చ చేస్తుందో ఊహించుకోవచ్చు. ఇక ఆయన లిస్ట్ ప్రకారం మిగిలిన కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే భరణి శంకర్, రాము రాథోడ్, సుమన్ శెట్టి వంటి వారు ఉన్నారు. భరణి శంకర్ చూసేందుకు చాలా గట్టి మనిషి లాగానే అనిపిస్తాడు. ఈయన ద్వారా కూడా కాంట్రవర్సిలు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఇద్దరు కూడా సాఫ్ట్ కంటెస్టెంట్స్ లాగా అనిపిస్తున్నారు, హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఎలా ఉంటారో చూడాలి మరి.
ఇక మిగిలిన కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఆశా షైనీ, సంజన గల్రాని మరియు శ్రేష్టి వర్మ. వీరిలో శ్రేష్టి వర్మ ని అంత తేలికగా మనం మరచిపోలేము. గత ఏడాది ఈమె కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు వేసి పెద్ద దుమారమే రేపింది. సుమారుగా నాలుగు నెలల పాటు ఆమె చర్చల్లో నిల్చింది. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడాలి. ఇక సంజన గల్రాని విషయానికి వస్తే ఈమె బుజ్జిగాడు చిత్రం లో త్రిష చెల్లి గా నటిస్తుంది. కన్నడ పెద్ద స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ళు కొనసాగింది. అక్కడి బిగ్ బాస్ లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే పేరుంది, చూడాలి మరి హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అనేది. ఇక ఆశా షైనీ కూడా కాస్త సున్నితమైన కంటెస్టెంట్ అని తెలుస్తుంది. ఇక అగ్నిపరీక్ష షో ద్వారా ఎంపికైన సామాన్యుల విషయానికి వస్తే మర్యాద మనీష్, ఆర్మీ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజా, మాస్క్ మ్యాన్ హరీష్ మరియు ప్రియా శెట్టి హౌస్ లోపలకు వెళ్లారట. ఆది రెడ్డి లెక్క ప్రకారం ఇది చివరి లిస్ట్. చూడాలి మరి ఈ లిస్ట్ ఎంత మాత్రం నిజం అనేది.