Homeజాతీయ వార్తలుRahul Gandhi: లోక్‌సభలో రాహుల్‌ రచ్చ.. ఆధారాలు లేని ఆరోపణల వెనుక అమెరికా?

Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్‌ రచ్చ.. ఆధారాలు లేని ఆరోపణల వెనుక అమెరికా?

Rahul Gandhi: భారత పార్లమెంటులో ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల చర్చ జరిగింది. ఇందులో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అసలు అంశంపై మాట్లాడకుండా మాజీ ఆర్మీ చీఫ్‌ నరవాణె ఆత్మకథలోని అంశాలు ప్రస్తావించారు. 2020 గల్వాన్‌ ఘటన సమయంలో చైనా దూసుకువచ్చినప్పుడు ప్రభుత్వం ధైర్యం చేయలేదని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భయపడ్డారని పేర్కొన్నారు. అయితే ఈ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు. అనుమతి లేకుండా ప్రచురణ.. రక్షణ శాఖలో పనిచేసిన అధికారులు రాసే […]

Rahul Gandhi: భారత పార్లమెంటులో ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల చర్చ జరిగింది. ఇందులో విపక్ష నేత రాహుల్‌ గాంధీ అసలు అంశంపై మాట్లాడకుండా మాజీ ఆర్మీ చీఫ్‌ నరవాణె ఆత్మకథలోని అంశాలు ప్రస్తావించారు. 2020 గల్వాన్‌ ఘటన సమయంలో చైనా దూసుకువచ్చినప్పుడు ప్రభుత్వం ధైర్యం చేయలేదని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భయపడ్డారని పేర్కొన్నారు. అయితే ఈ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు.

అనుమతి లేకుండా ప్రచురణ..
రక్షణ శాఖలో పనిచేసిన అధికారులు రాసే పుస్తకాలు ప్రచురణకు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి. ఈ పుస్తకానికి అనుమతి ఇవ్వలేదు. కొన్ని అంశాలు మాత్రమే పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పార్లమెంటు నియమాల ప్రకారం నిరాధార అంశాలు, పుస్తకాలు, పత్రికా కథనాలు ఆధారంగా మాట్లాడకూడదు. నరవాణె వాస్తవానికి ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుందని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు దూరం
ప్రసంగం రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధం లేకుండా చైనా విషయంపై రాహుల్‌ దృష్టి పెట్టారు. ఇందుకు కారణం ఉంది. ద్రౌపది ముర్ము ఎన్నికైన తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాలు సహకారంతో అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. ఇది ఉద్రిక్తతలను తగ్గించే సంకేతంగా కనిపించింది.

అమెరికా ఆటలో భాగమా?
ఆసియాలో భారత్‌–చైనా సంబంధాలు మెరుగుపడితే అమెరికాకు ఇబ్బంది. రాహుల్‌ ప్రసంగం దీన్ని ఆపే ప్రయత్నంగా కనిపిస్తోంది. అమెరికా సందర్శనల్లో చైనా విషయాలు ప్రస్తావించడం, వాణిజ్య ఒప్పందాల హడావుడి ఈ భావనకు బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంటు వేదికను ఉపయోగించి దౌత్య సంబంధాలను దెబ్బతీయాలనే ఉద్దేశం ఉందా అన్న చర్చ ఊపందుకుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper